అందరి ప్రార్థనలు ఫలించి, దేవుని దయతో స్వల్ప నష్టంతో తుఫాన్ నుండి బయటపడ్డాము - నాదెండ్ల మనోహర్.
తుఫాన్ పునరావాస కేంద్రాలు నుండి తిరిగి ఇంటికివెళ్ళే కుటుంబాలకు 25 కేజీలు బియ్యం, నిత్యవసర సరుకులు, నగదు పంపిణీ..
బాధితులకు మనిషికి వెయ్యి రూపాయలు, గరిష్టంగా కుటుంబానికి రూ 3 వేలు రూపాయలు అందజేస్తాము..
పునరావాస బాధిత కుటుంబాలకు బియ్యం, నిత్యవసర సరుకులు, నగదు తొలిపంపిణీ కార్యక్రమంలో జిల్లా ఇంచార్చి మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు సంయుక్తంగా పాల్గొని బాధితులకు పంపిణీ చేశారు..
ఏలూరు/పెదపాడు, అక్టోబరు 29: పెదపాడు మండలం హనుమాన్ జంక్షన్ - ఏపూరు గ్రామం యంపిపి ప్రాథమిక పాఠశాలలో బుధవారం పునరావాస కేంద్రాన్ని సందర్శించి, బాధిత కుటుంబాలను కలసి, ఇప్పటివరకు అందుకున్న సౌకర్యాలు అడిగి తెలుసుకుని, బియ్యం, నిత్యవసర సరుకులు, నగదు పంపిణీని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మరియు జిల్లా ఇంచార్చి మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడులు సంయుక్తంగా పాల్గొని బాధితులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంచార్చి మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముంపుబారిన కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించి సకల సౌకర్యాలు కల్పించామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవం సూచనలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు, సమీక్షలు చేస్తూ అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీచేశారని అన్నారు. అందరూ ప్రార్థనలు ఫలించి, దేవుని దయతో స్వల్ప నష్టంతో తుఫాన్ నుండి బయటపడ్డామని అన్నారు.ఈ నాలుగు రోజులు అనుభవాలు భవిష్యత్తులో మనకు ఎంతోగానో ఉపయోగపడతాయని అన్నారు. సివిల్ సప్లై కార్పొరేషన్ మాశాఖ తరపున రాష్ట్రవ్యాప్తంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు చేపట్టామన్నారు. మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని, అధికార యంత్రాంగం సూచనలు, సలహాలు పాటించాలని, పుకార్లు, వదంతులు నమ్మవద్దని ఈ సందర్భంగా ప్రజలకు, రైతులకు ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లా ఇంచార్చి మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి సంయుక్తంగా తీసుకున్న సహాయక చర్యలు, తగు జాగ్రత్తలు మా నియోజకవర్గంలో పునరావాస కేంద్రాలు, సహాయక కార్యక్రమాల్లో పాల్గొనుటకు మాకు ఎంతగానో స్ఫూర్తి కలిగి 20 గంటలు పైగా పనిచేసి, విజయవంతంగా కార్యక్రమాలు చేసుకున్నామని అన్నారు. శివారు ప్రాంతాల్లో డేరాలు కట్టుకుని, రేకుల షెడ్లు, పూరిపాకల్లో నివసిస్తున్న 32 కుటుంబాలు 96 మందిని యంపిపి ప్రాథమిక పాఠశాలలో తరలించి భోజన వసతి సౌకర్యాలు కల్పించమన్నారు. ముందుచూపుతో జిల్లాలో ఉంగుటూరు, కైకలూరు, దెందులూరు నియోజకవర్గాలలో ఇంచార్చి మంత్రి, జిల్లా కలెక్టరు ఫోకస్ పెట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విజయవంతం అయ్యామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బాధిత కుటుంబాలకు బియ్యం, నిత్యవసర సరుకులు, నగదు పంపిణీ తొలి కార్యక్రమం నా నియోజకవర్గంలో జరుగుట నాకు ఎంతో సంతృప్తిని, సంతోషం కలిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డీల అభివృద్ధి కార్పోరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఆర్డీవో యం. అచ్యుత అంబరీష్, డియస్ వో ఇ.బి.విలియమ్స్, జిల్లా వ్యవసాయ శాఖ జెడి షేక్ హబీబ్ భాషా, తహశీల్దారు ఏ.కృష్ణజ్యోతి, మండల అధికారులు, బాధిత కుటుంబాలు, స్థానిక ప్రజలు, రెవిన్యూ, గ్రామ సచివాలయ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.

