మానసిక అనారోగ్యాన్ని పాజిటివ్ ఆలోచనల ద్వారా దూరం చేసుకోవచ్చు - సి. శివరాం, ప్రిన్సిపాల్.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రపంచ మానసిక ఆరోగ్యం దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న జరుపుకుంటామని, ప్రతి సంవత్సరం కూడ అక్టోబర్ 4 నుండి 10 వరకు మానసిక ఆరోగ్య దినోత్సవ వారోత్సవాలు భాగంగా విద్యాలయ నందు ప్రిన్సిపాల్ సి. శివరాం ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ మానసిక ఆరోగ్యం కార్యక్రమన్ని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా విద్యాలయ ప్రిన్సిపాల్ సి. శివరాం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితం లో ఎప్పుడు పాజిటివ్ ఆలోచనల కల్గి ఉంటే మానసిక సమస్యలు దూరం చేసుకోవచని అన్నారు. అలాగే విద్యాలయ కౌన్సిలర్ డాక్టర్ పెద్దిగారి లక్ష్మన్న మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో చాలా మంది, విద్యార్థులు మానసికమైన సమస్యలతో బాధ పడుతున్నారని వాటిని ఎలా ఎదురుకోవాలో విద్యార్థులకు వివరించారు అలాగే ప్రతి ఒక్కరు మంచి సంతులిత ఆహారం తీసుకొని, యోగ, ధ్యానం, వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి అన్నారు.భారతదేశంలోని 23% మంది పాఠశాల విద్యార్థులు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 'నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్', సీబీఎస్ఈ సంస్థలు పాఠశాలల్లో నిర్వహించిన ఒక సర్వేలో 13-19 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులలో 81% మందికి పరీక్షల ఒత్తిడి ప్రధాన సమస్యగా ఉందని భారతదేశంలో 15-24 సంవత్సరాల వయస్సు గల యువతలో 14% మంది తరచుగా ఆందోళన లేదా డిప్రెషన్ వంటి వాటితో బాధపడుతున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యాలయ కౌన్సిలర్ కె. త్రివేణి, ఉపాధ్యాయులు కృపారావు, ఉబా రాజు, కిషోర్, అఖిలేసు నెగి,మల్లికార్జున రావు, పరస మూర్తి,తాతయ్య,అయ్యన్న, వెంకటేశ్వర్లు,భద్రరావు, సలోమి, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Add


