క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్)
పి. మహేశ్వరరావు.
అనకాపల్లి, అక్టోబర్ 17:
జిల్లా పోలీస్ సిబ్బంది వ్యక్తిగత, వృత్తిపర మరియు శాఖాపరమైన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కట్టుబడి ఉండే క్రమంలో, “పోలీస్ వెల్ఫేర్ డే” కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ
“పోలీసు సిబ్బంది సంక్షేమమే మా ప్రాధాన్యం. ప్రతి పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను వ్యక్తిగతంగా విని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటాం. ప్రతి విజ్ఞాపనను సానుకూలంగా పరిశీలించి, సమస్య పరిష్కారం వరకు పర్యవేక్షిస్తాను. అందరు సిబ్బంది నిర్మొహమాటంగా తమ సమస్యలను తెలియజేయాలి” అని తెలిపారు.
వెల్ఫేర్ డే లో భాగంగా ఎస్పీ తన చాంబర్‌లో సిబ్బందిని వ్యక్తిగతంగా పిలిపించి, వారి అభ్యర్థనలను స్వీకరించారు. అనంతరం సంబంధిత శాఖాధికారులను ఆదేశించి, తక్షణ పరిష్కార చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా పోలీస్ సిబ్బందికి మరింత అనుకూల వాతావరణం కల్పించేందుకు, ఇలాంటి వెల్ఫేర్ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు.
