కేంద్ర ప్రభుత్వ పథకాలను పకడ్బందిగా అమలు చేయాలి.



 కేంద్ర ప్రభుత్వ పథకాలను పకడ్బందిగా అమలు చేయాలి.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో పకడ్భందీగా అమలు చేసేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి , అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యలు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ప్రాయోజిత కార్యక్రమాల అమలుపై పార్లమెంట్ సభ్యులు.శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు తో కలసి సంబంధిత అధికారులతో సమీక్షించడం జరిగింది. 

ఈ సమావేశంలో ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, ఒంగోలు, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు, డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, శ్రీ కందుల నారాయణ రెడ్డి, దర్శి నియోజకవర్గం టిడిపి ఇంచార్జి డా గొట్టిపాటి లక్ష్మీ, ఎంపిపి లు, జడ్పిటిసి లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.  

ఈ సమావేశంలో జిల్లాలో అమలు జరుగుచున్న జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ, పీఎం గ్రామీణ సడక్ యోజన, పీఎం ఆవాస్ యోజన కింద పేదలకు గృహాల మంజూరు, జల జీవన్ మిషన్ కార్యక్రమం అమలు మరియు అమృత్ 1, 2 పధకాల ద్వారా ప్రజలకు త్రాగునీటి పధకాలు అమలు, పంచాయతీరాజ్ , జాతీయ రహదారులు, పీఎం సూర్య ఘర్ పథకం అమలు తదితర లక్ష్యాల పురోగతి పై శాఖల వారీగా సమీక్షించడంతో పాటు గత సమావేశంలో చర్చించిన అంశాలపై సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలపై సమీక్షించడం జరిగింది.   

ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ చైర్మన్ మరియు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల పై ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించడం జరుగుతుందన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖలో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా చేపడుతున్న దాదాపు 42 రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వాటికి చేసిన ఖర్చు వివరాలను సమీక్షిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో పకడ్భందీగా అమలు చేయడంతో పాటు సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి నిరుపేదకు అధికారులు అందించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. వివిధ పధకాల కింద చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి నిర్దేశించిన లక్ష్యాలు సాధించడానికి, చేరుకోవడానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. ఈ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యలు, అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఎంపి ల్యాడ్స్ కింద మంజూరయ్యే పనులను నిర్ణీత గడువు లోపు పూర్తి చేసే అంశం పై అధికారులు దృష్టి పెట్టాలన్నారు.  

  కేంద్ర ప్రభుత్వం కోటి గృహాలకు సోలార్ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా, రాష్ట్ర ముఖ్యమంత్రి.ఈ విషయమై ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారన్నారు. జిల్లాలో పీఎం సూర్య ఘర్ పథకం పటిష్టంగా అమలు జరిగేలా విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఎంపి, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.  

జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు మాట్లాడుతూ, ఈ దిశ సమావేశంలో ప్రజాప్రతినిధులు ఏఏ సమస్యలను, అంశాలను ప్రస్తావించారో, ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాలను, సమస్యలను సమగ్రంగా పరిశీలన చేసి వచ్చే సమావేశం నాటికి పరిష్కారం చూపేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. క్షేత్ర స్థాయిలో అమలు జరుగుచున్న కార్యక్రమాలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళుతూ, అవసరమైతే వారిని కూడా భాగస్వాములను చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. 

ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత మాట్లాడుతూ, వివిధ కారణాల వలన కొందరి పెన్షన్ తీసివేయడం జరిగిందని, వాటిపై సమగ్ర విచారణ చేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. నగరంలోని పోతురాజు కాలువ, నల్ల కాలువల్లో పుడిక తీత పనులు చేపట్టాల్సిన అవసరం వుందని కోరారు.

ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు మాట్లాడుతూ, పొజిషన్ సర్టిఫికెట్స్ రాకపోవడంతో చాలా మంది పేద వర్గాల ప్రజలు గృహ నిర్మాణ పధకాలను సద్వినియోగం చేసుకోలేక పోతున్నారని, పొజిషన్ సర్టిఫికెట్స్ లేనివారికి పొజిషన్ సర్టిఫికెట్స్ మంజూరు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

కనిగిరి శాసన సభ్యలు డా. ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి మాట్లాడుతూ, కనిగిరి నియోజక వర్గంలో ప్రతిపాదించిన త్రాగునీటి పధకాలకు సంబంధించిన కొత్త పైప్ లైన్ నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చెరువుల్లో, కేనాల్స్ లో జంగిల్ క్లియరెన్స్ తాత్కాలికంగా కాకుండా పూర్తీ స్థాయిలో క్లియరెన్స్ చేయాలని అధికారుల దృష్టి తీసుకువచ్చారు. సదరం సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కొరకు వ్యయప్రయాసలకు గురై ఒంగోలు జిల్లా కేంద్రానికి రావాల్సి వస్తున్నదని, డివిజన్ స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లయితే బాగుంటుందన్నారు. 

గిద్దలూరు శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మాట్లాడుతూ, గిద్దలూరు నుండి నంద్యాలకు వెళ్ళే దారిలో గిద్దలూరు నుండి సుమారు రెండు, మూడు కిలో మీటర్ల మేర రోడ్డు దెబ్బతిన్నదని, ఈ రోడ్డు మరమ్మతులపై అధికారులు దృష్టి సారించాలన్నారు. అర్హతలేని చాలా మందికి డిజేబుల్ సర్టిఫికెట్స్ జారీ చేయడం వలన వారు పెన్షన్ పొందుతున్నారని, ఈ విషయంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి డిజేబుల్ సర్టిఫికెట్స్ ను జారి చేసిన సంబంధిత వైద్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు వారికి పెన్షన్ నిలుపుదల చేయాలని కోరారు. అలాగే అర్హత కలిగిన వారికి పెన్షన్ మంజూరు చేయాలన్నారు. 

మార్కాపురం శాసన సభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, త్రాగునీటి సరఫరా పనుల్లో భాగంగా పైపు లైన్లు వేయుటకు రోడ్లను త్రవ్వడం జరిగిందని, ప్రస్తుతం త్రాగునీటి సరఫరా జరగడం లేదని, తవ్విన రోడ్లకు మరమత్తు చేపట్టలేదని తెలిపారు. దూపాడు వద్ద తాగునీటి పైపు లైన్ పగిలి పోవడంతో తాగునీటి సరఫరాకు ఇబ్బండి జరుగుచున్నదని దీనిపై అధికారులు దృష్టి సారించాలన్నారు. 

ఈ సందర్భంగా పలువురు ఎంపిపి లు, జడ్పీటీసీలు పలు సమస్యలను కమిటీ సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. 

ఈ సమావేశంలో కనిగిరి మున్సిపల్ చైర్మన్ శ్రీ అబ్దుల్ గపూర్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన ఓబులేసు, జిల్లా పరిషత్ సి.ఈ. ఓ శ్రీ చిరంజీవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post