ప్రకాశం క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ఒంగోలు హైవే లో కొమరోలు మండలం, నాగిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన బైళ్ల అనిల్ నూతనంగా ఏర్పాటు చేసిన ఛాయ్ బస్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి విశిష్ట ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రారంభించిన ఛాయ్ బస్టర్ మంచి లాభాలతో ముందుకు సాగాలని యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. శాసనసభ్యులు గారి తో పాటు కొమరోలు మండల పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు, టిడిపి నాయకులు అంబవరం శ్రీనివాసరెడ్డి, పట్టణ నాయకులు బిల్లా రమేష్ వేములపాటి చంటి బద్రి భాష మరియు మహేష్ లు పాల్గొన్నారు.
