సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్.



సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా ఒంగోలు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మాట్లాడుతూ వ్యవసాయం, అనుబంధాల రంగాల రైతులు ఉపయోగించే యంత్రాలపై జీఎస్టీ12 శాతం నుండి5 శాతం తగ్గింపు జరగడం వలన వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతుందని పేర్కొన్నారు. 

శుక్రవారం సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ, దాని అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఒంగోలు డిఆర్.ఆర్.ఎం హై స్కూల్ లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు  మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, ఒంగోలు శాసన సభ్యులు  దామచర్ల జనార్దన్ రావు, నగర మేయర్  గంగాడ సుజాతలతో కలసి పాల్గొని ఈ సందర్భంగా నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీ ని ప్రారంభించారు. ఈ ర్యాలీ మినీ స్టేడియం వరకు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయం అనుబంధాల రంగాల రైతులు ఉపయోగించే యంత్రాలపై జీఎస్టీ12 శాతం నుండి 5 శాతం తగ్గింపు జరగడం వలన వారి జీవనప్రమాణాలుమెరుగుపడుతాయన్నారు. 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోడి  దేశ వ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లో జిఎస్టి ని అమలులోకి తేవడం జరిగిందన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ మరియు దాని అనుబంధ రంగాలకు సంబంధించిన పరికరాలపై గతంలో 12- 18 శాతం వున్న పన్ను ను 5 శాతంకు తగ్గించడమైనది. ఈ తగ్గింపు వలన రైతులకు ఆదా అవడం జరుగుతుందన్నారు. అన్నీ వర్గాల ప్రజలు ఈ జిఎస్టి తగ్గింపు పై పూర్తిగా అవగాహన చేసుకొని తగ్గింపు ఫలాలను పొందాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ, సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మకమైన మార్పు నాంది పలుకుతూ రెండు స్లాబులకే పరిమితం చేయడం వలన అన్నీ వర్గాల ప్రజలు వినియోగించే వస్తువల రెట్లు గణనీయంగా తగ్గాయని, వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో గత నెల 22 నుండి నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

 ఈ తగ్గింపు వలన ప్రతి కుటుంబానికి నెలకు 5 వేల రూపాయల నుండి 12 వేల రూపాయల వరకు అదా అవుతుందన్నారు.  వ్యవసాయ దాని అనుబంధ రంగాల పరికరాలపై తగ్గింపు పై రైతులకు అవగాహన కల్పించేలా లక్ష్యంతో ఈ రోజు ఈ అవగాహన కార్యక్రమాన్ని జరుపుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.  రైతులు పూర్తిగా అవగాహన చేసుకుని జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను పొందాలని తెలిపారు.

ఒంగోలు శాసన సభ్యులు  దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నాయన్నారు. జీఎస్టీ 2. O లో రైతులకు పెద్దఎత్తున లబ్ది చేకూరేలా పన్నుల స్లాబులను తగ్గించారన్నారు. సాగులో రైతులకు అవసరమైన పరికరాలు, డ్రిప్, స్ప్రింక్లర్లు, ట్రాక్టర్లు, వాటి విడిభాగాలు, డ్రోన్లు, , యాంత్రీకరణకు సంబందించిన వరికోత యంత్రాలు, తదితర యంత్ర పరికరాలలో జీఎస్టీ తగ్గింపు లబ్ది ఎక్కువగా ఉంటుందన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యతను ఇస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలుపుతున్నారన్నారు. 

నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత మాట్లాడుతూ, రైతు బాగుంటే ప్రజలు బాగుంటారని, జీఎస్టీ లో స్లాబులు తగ్గింపు కారణంగా రైతులు వినియోగించే సాగు పరికరాల నుండి టాక్టర్ వంటి పెద్ద వస్తువుల వరకు అన్నిరకాల వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయన్నారు. జీఎస్టీ తగ్గింపు ఫలాలు సద్వినియోగం చేసుకునేలా ప్రతి రైతు తగ్గింపు పై అవగాహన కలిగి వుండాలన్నారు. 

ఈ సందర్భంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై ముద్రించిన వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన స్టాల్స్ ను తిలకించారు. ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం టిడిపి ఇంచార్జి డా గొట్టిపాటి లక్ష్మీ, వ్యవసాయ శాఖ జేడి శ్రీనివాస రావు, పశు సంవర్థక శాఖ జేడి వెంకటేశ్వర రావు, మత్స్య శాఖ జేడి శ్రీనివాస రావు, జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపి చంద్, ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పిడి శ్రీనివాస రావు, ఆగ్రో అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

 

Post a Comment

Previous Post Next Post