అగ్ని ప్రమాదానికి గురైన ప్రెవేట్ బస్సును పరిశీలించిన ఉన్నతాధికారులు.
కర్నూల్ జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు నాయకల్లు ఫ్లై ఓవర్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన
కర్నూల్ రేంజ్ డీఐజీ శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ , జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి , జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపిఎస్ , జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్.
ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నటేకూరు నాయకల్లు ఫ్లై ఓవర్ మధ్య హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 41 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.
24 వ తేది తెల్లవారుజామున 3, 3-10 గంటల సమయంలో బైక్ ను ఢీకొనడంతో బస్సు నుండి ఇంధనం లీక్ కావడంతో ప్రమాదం జరిగింది
21 మంది సురక్షితంగా ఉన్నారు
మిగిలిన 20 మందిలో 11 మంది మృతదేహాలను గుర్తించడం జరిగింది
మిగిలిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని అధికారులు తెలిపారు
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటన లో భాగంగా స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. బాధితులను పరామర్శించారు.
ప్రజాప్రతినిధులు ఎంపీలు శబరి, బస్తీపాటి నాగరాజు, శాసనసభ్యులు గౌరు చరితలు ప్రమాద ఘటన స్థలానికి చేరుకుని ప్రమాద ఘటన పై ఆరా తీసి పరిశీలించారు.

