శానంపూడి యువకుడికి మంత్రి డా. స్వామి ఆపన్న హస్తం.


 శానంపూడి యువకుడికి మంత్రి డా. స్వామి ఆపన్న హస్తం.

 ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

కరెంట్ షాక్ తో చేయి కోల్పోయిన యువకుడికి (ఆర్టిపిషియల్ హ్యాండ్) కృత్రిమ చేయి ఏర్పాటు చేయించిన మంత్రి డా.స్వామి.

ప్రకాశంజిల్లా తూర్పునాయుడుపాలెం, 

             విద్యుత్ ప్రమాదంలో చేయి కోల్పోయిన యువకుడికి మంత్రి డా. డోలా బాలవీరాంజనేయస్వామి ప్రత్యేక చొరవతో (ఆర్టిపిషియల్ హ్యాండ్) కృత్రిమ చేయి ఏర్పాటు చేయించి అండగా నిలిచారు. కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలం శానంపూడి గ్రామానికి చెందిన సత్యాల సుమంత్ చేయి విద్యుత్ ఘాతంతో (2024 డిసెంబర్ లో) పూర్తిగా కాలిపోయింది. ఇటీవల మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామిని కలిసి తనకు సాయం చేయవలసిందిగా సుమంత్ అభ్యర్దించారు. మంత్రి వెంటనే మంగళగిరి రోటరీ క్లబ్ వారితో మాట్లాడి వారి సహకారంతో సుమంత్ కి కృత్రిమ చేయి (ఆర్టిపిషియల్ హ్యాండ్ ) ఏర్పాటు చేయించారు. ఈ సంధర్బంగా నేడు తూర్పునాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామిని కలిసి సుమంత్ కృతజ్ఞతలు తెలిపారు.

Add 


Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post