జాతిపిత మహాత్మా గాంధీ జయంతికి డివైఎఫ్ఐ ఘన నివాళి- జి సూర్య కిరణ్.


జాతిపిత మహాత్మా గాంధీ జయంతికి డివైఎఫ్ఐ ఘన నివాళి- జి సూర్య కిరణ్.

మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలి మహాత్మా గాంధీ ల విగ్రహనికి వినతి పత్రం అందిస్తున్న డివైఎఫ్ఐ బృందం.


 అక్టోబర్ 2 జంగారెడ్డిగూడెం. క్రైం 9మీడియా ప్రతినిధి.

జంగారెడ్డిగూడెం పట్టణంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం రోడ్డులో హైస్కూల్ వద్దనున్న గాంధీ విగ్రహం వద్ద జయంతి కార్యక్రమం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా జరిగిన జయంతి సభలో కమిటీ సభ్యులు ఎస్కే మాబు సుభాని అధ్యక్షత వహించారు ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి సూర్య కిరణ్ పూలమాలవేసి ఘన నివాళి అర్పించి వినతి పత్రం అందజేయడం జరిగినది.

ఈ సందర్బంగా సూర్య కిరణ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన మహాత్మా గాంధీ శాంతియుతంగా, అహింసా మార్గంలో యువతను నడవాలని చెప్పారని అన్నారు.ఇప్పుడు ఉన్న పరిస్థితులలో దేశంలో యువత శాంతియుత పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. మతోన్మాదంతో చెలరేగుతున్న హింసా, మహిళల పట్ల దాడులు, కుల వివక్షత జరుగుతుంటే ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగాన్ని కల్పించిన హక్కులను కాల రాస్తుంటే పాలకులు మాటలకే యువత పరిమితం అవుతున్నారని తెలిపారు. కానీ నేడు బాధితులకు న్యాయం చేయాలనీ, హింసలను ప్రేరేపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వలు విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి తొత్తులుగా మారిన ఆర్ఎస్ఎస్ ప్రముఖులను దేశభక్తులుగా చిత్రీకరించేందుకు సర్వ ప్రయత్నాలు కేంద్ర బీజేపీ చేస్తున్నదని విమర్శించారు. మహాత్మా గాంధీని చంపిన గాడ్సే ఇప్పుడు భారతదేశ స్వతంత్ర పోరాట యోధులుగా చిత్రీకరించడంలో బీజేపీ ప్రభుత్వం కీలక పాత్ర వహిస్తుందని మండిపడ్డారు. ఒకవైపు దేశ సంపదను, ప్రభుత్వారంగా సంస్థలను, ప్రైవేటుదారులకు కట్టబెట్టడం ఇప్పుడున్న పాలకులకు దేశానికి చేస్తున్న ద్రోహం అని విమర్శించారు. నిరంతరం పెరుగుతున్న నిరుద్యోగం అరికట్టడంలో బిజెపి ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని ఇచ్చిన హామీలను గాలికి వదిలేసారని విమర్శించారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో తెలుగుదేశం,జనసేన, బిజెపి పార్టీకి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని, రాష్ట్ర హక్కులను కాల రాస్తున్నారని విమర్శించారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు,విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, కార్మికుల హక్కులను కాలరాత్తున్నాయని ఆవేదన చేశారు. ఈ సమస్యలు కూటమి ప్రభుత్వానికి కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వరంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలని, దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న కాలంలో మహాత్మా గాంధీ బాటలో శాంతియుత ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకం ప్రజలను కదిలించి పోరాటాలు కొనసాగిస్తామని దేశ ప్రజలే పార్టీలకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పి పోతురాజు, సిహెచ్ రవి,ఏ ప్రభాకరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.




 

Post a Comment

Previous Post Next Post