మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్బంగా నివాళులు అర్పించిన ముత్తుముల.



 మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్బంగా నివాళులు అర్పించిన ముత్తుముల.


గిద్దలూరు నియోజకవర్గ క్రైమ్ 9 ఇంచార్జ్ బి అమృత రాజ్.

ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుక సందర్బంగా ఆయన చిత్ర పటానికి గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. 

ఈ సందర్బంగా మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం భారత రాజ్యాంగం పంచాయితీ వ్యవస్థను రూపొందిస్తే గతంలో వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ పంచాయితీల నిధులను అడ్డగోలుగా దోచేసిందని ఆరోపించారు.

 గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులను జగన్ రెడ్డీ స్వలాభాల కోసం దారి మళ్లించడమే కాకుండా సర్పంచ్ లకు ఉండే అధికారాల్ని కూడా నిర్వీర్యం చేశాడన్నారు.

 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గాంధీజీ ఆశయాలను పంచాయితీలలో అమలు చేస్తూ పంచాయతీల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ అధ్యక్షులు సయ్యద్ శానేశా వలి, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డీ, గిద్దలూరు మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాల ఈశ్వరయ్య, బీసీ నాయకులు నంది శ్రీను, అంబవరం శ్రీనివాసరెడ్డి, పట్టణ కౌన్సిలర్లు మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post