స్థాయికి తగ్గ బోధనతో సత్ఫలితాలు.
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )
కంభం: ప్రకాశం జిల్లా కంభం మండలం కందులపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3,4,5, తరగతి విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించి టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ ద్వారా విద్యార్థులలో అంకగణిత నైపుణ్యాలు,ప్రాధమిక పఠన సామర్థ్యాలను పెంపొందించవచ్చని ఎంఈఓ-2 శ్రీనివాసులు అన్నారు.విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ కార్యక్రమ నిర్వహణపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ప్రాధమిక స్థాయి బోధన సవాళ్లతో కూడుకున్నదని,ప్రాథమిక దశలో విద్యార్థులను తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల నైపుణ్యాలకు కొలమానమంటూ, బి.సిహెచ్.రంగస్వామి, ఎం.వర ప్రసాద్ బోధన నైపుణ్యాలను ప్రశంసించారు.అనంతరం డొక్కా. సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాలను రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు.
