టిడిపి కార్యకర్త కుటుంబానికి భరోసా గిద్దలూరు శాసనసభ్యులు.
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )
బాధిత కుటుంబానికి రూ. 50 వేలు ఆర్థిక సహాయం అందించిన ముత్తుముల.
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లపాడు గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన టిడిపి కార్యకర్త మండ్ల బుజ్జి.కుటుంబానికి గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి భరోసానిచ్చారు.
కుటుంబ పెద్దను కోల్పోవటంతో ఇబ్బందులు పడుతున్న బాధిత కుటుంబానికి శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి తన వ్యక్తిగత సహాయంగా రూ. 50.000, లు (అక్షరాల యాభై వేల రూపాయలు) ఆర్ధిక సహాయం వారి సతీమణి మండ్ల తిరుమలమ్మ కు టీడీపీ నాయకుల ద్వారా అందచేశారు.. బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కడియం శేషగిరి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ వినుకొండ చిన్న, గిద్దలూరు పట్టణ 3వ వార్డు కౌన్సిలర్ పాలుగుళ్ళ చిన్న శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు పాలుగుళ్ళ పెద్ద శ్రీనివాసరెడ్డి, మరడ దిలీప్, యల్లా అశోక్, మండ్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గోన్నారు.
