గురు" సాక్షాత్ పర బ్రహ్మ*
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు )
ప్రకాశం జిల్లా కంభం ఎంపిడిఓ కార్యాలయంలో మండల స్థాయి గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వీరభద్రాచారి మాట్లాడుతూ గురువులు సాక్షాత్తు ప్రోగ్రాం పరబ్రహ్మస్వరూపులని తెలియజేశారు. ఎంఈఓ అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ బ్రహ్మదేవుడు వ్యక్తిని సృష్టిస్తే. గురుదేవుడు వ్యక్తిత్వాన్ని వ్యవస్థను సృష్టిస్తాడని వ్యాఖ్యానించారు.
ప్రారంభ ఉపన్యాసకులుగా సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు ఎం.రమేష్ బాబు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సమగ్ర జీవిత చరిత్రను కళ్ళకు కట్టినట్టు తెలియజేశారు. అనంతరం ఎంఈఓ 2 టి శ్రీనివాసరావు మాట్లాడుతూ."గురువు" అంటే చీకటిని పారద్రోలే వెలుగని, గురువులను వర్ణించేందుకు వర్ణమాల చాలదని అన్నారు.
అనంతరం కంభం,రాచర్ల మండలంలోని ఉపాధ్యాయులు మరియు జంగం గుంట్ల క్లస్టర్. చైర్మన్ గని వెంకటేశ్వర్లు. మాట్లాడుతూ సహనం,సంసిద్ధత,సద్భావనల సారూప్యమే ఉపాధ్యాయుల మూర్తిమత్వమనీ, ఉపాద్యాయ వృత్తిని మించినది మరేదీ లేదనీ, అక్షరాలను నేర్పించే ఆది గురువులే అసలైన గురువులన్నారు. అక్షరాలతో బాటు అంతరంగాన్ని , అంతరిక్షాన్ని అధ్యయనం చేయించే సత్తా గురువుల సొంతమని వారు తెలియజేశారు.ఈ సందర్భంగా మండలంలో క్లస్టర్ వారీగా అన్ని రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన గురువులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికచేసి, పురస్కార పత్రాలు, పూలమాలలు శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు. జంగంగుంట్ల క్లస్టర్ నుండి కె.బి.రామయ్య, కె. విజయనిర్మల, పి.వి.ఎన్.కళ్యాణి, కంభం క్లస్టర్ నుండి సయ్యద్ ఆదిల్, ఎస్.కె రేష్మాభాను, పసుపులేటి. శ్రీరాములు, సిహెచ్. వీరనారాయణ, తురిమెళ్ళ క్లస్టర్ నుండి సయ్యద్ షబ్బీర్, జి.జ్యోతి లక్ష్మమ్మ, డి రాజేష్ , ఎస్.కె అబ్దుల్ మజీద్ గారు, సిఆర్ఎంటి. జె.అనురాధ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీలు, మండలంలోని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
