ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మానo*




ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మానo*

 ( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు )

 ప్రకాశం జిల్లా కంభం లోని నాయక్ వీధి ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో పనిచేసి బదిలీపై వెళ్ళిన ఉపాధ్యాయుల సేవలకు గుర్తింపుగా,గురువారం పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులు  ఇక్బాల్ భాషా ఉపాద్యాయులను ఘనంగా సన్మానించారు. సెప్టెంబర్-5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా  ఉపాధ్యాయులు సహేరా బేగం , రహమతున్నీసా ,  ఇక్బాల్ భాషా గతంలో పనిచేసిన నాయక్ వీధి ఉర్దూ పాఠశాలకు వచ్చి విద్యార్థులతో మమేకమయ్యారు.గత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ విద్యార్థులతో మాటామంతీ కలిపి మైమరచిపోయారు. స్వీయచిత్రాలు తీసుకుని మురిసిపోయారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు  త్రివిక్రమరావు మాట్లాడుతూ సహృదయం,సేవా భావాలున్న గురువుల జ్ఞాపకాలను, పాఠశాలలోని నల్ల బల్లలు, నాలుగు గోడలు సైతం ఎల్లవేళలా గుర్తుచేసుకుంటాయని, విద్యార్థుల తలపుల్లో తారాడుతూ ఉంటాయని అన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు,సహోపాధ్యాయులు  గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, శాలువా పూలమాలలకు ఆప్యాయతానురాగాలను అద్ది అలంకరించారు. ఉపాధ్యాయులు రహమతున్నీసా  రేడియో పాఠాలను గుర్తుచేస్తూ రాగాలాలపించగా, సహెరా బేగం సాంస్కృతిక కార్యక్రమాల సరదాలను పంచుకున్నారు.ఇక్బాల్ భాషా మధ్యాహ్న భోజనాల రుచులను,ధ్యాన సమయంలోని దక్షతను గుర్తుచేసి ఆనందాలను పంచుకున్నారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ రుక్సానా మాట్లాడుతూ నాయక్ వీధి ఉర్దూ పాఠశాలలో  పనిచేసిన ఉపాధ్యాయులందరూ వారి వారి సద్గుణాలు,సహజ నైపుణ్యాలతో ప్రత్యేకను చాటుకున్నారనీ,అందుకే నాయక్ వీధి ఉర్దూ పాఠశాల కీర్తి  పతాక స్థాయిలో ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు యాస్మిన్, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ పఠాన్ రుక్సానా, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post