దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ .




దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణాల పంపిణీ .

( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )

ప్రకాశం జిల్లా కంభం మండల కేంద్రంలో
 బోర్డు స్కూల్ భవిత కేంద్రంలో బుధవారం ఎంఈవోలు అబ్దుల్ సత్తార్,శ్రీనివాసులు దివ్యాంగ విద్యార్థులకు సీపీ చైర్లు,వీల్ చైర్లు తదితర ఉపకరణాలను పంపిణీ చేశారు
.ఈ సందర్భంగా దివ్యాంగ చిన్నారుల జీవనశైలిపై తల్లిదండ్రులతో చర్చించారు.దివ్యాంగ చిన్నారులతో వ్యవహరించే తీరును వివరించారు.దైర్యం,దిద్దుబాటు చర్యలతో వారిలో దీర్ఘకాలిక మార్పులను సాధించవచ్చని తెలిపారు. 
అనంతరం ఫిజియోథెరపిస్ట్ సంధ్య చిన్నారులకు శారీరక చికిత్సలు చేశారు. కార్యక్రమంలో సిఆర్పిలు,స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయురాలు నూర్జహాన్, హెచ్ఎం వి.వెంకటేశ్వర్లు, ఐఈఆర్పిలు అరుణ్ కుమార్,ఈశ్వరి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post