తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ కు ఘన నివాళులు.



తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ కు ఘన నివాళులు.

40వ వర్ధంతి సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గ సీపీఐ ఆధ్వర్యంలో ఘన నివాళులు.

         భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ ఆశయ సాధన కోసం కృషి చేయాలని సీపీఐ  రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బోస్ పిలుపునిచ్చారు.ఈసీఐఎల్ చౌరస్తా వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహానికి సీపీఐ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సీపీఐ  రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బోస్ మాట్లాడుతూ 
ఐలమ్మ తన పంట పొలాలను కాపాడుకోవటం కోసం విస్నూర్ దొర గూండాలకు ఎదురొడ్డి కొంగునడుముకు చుట్టి కొడవలి చేతబట్టి సివంగిలా తిరగబడిందని తెలిపారు. వీరతెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్నికణం ఐలమ్మ అని ఆన్నారు.మట్టి మనుషులను ఒక్కటి చేసి మహయెాధులుగా తీర్చిదిద్ది బాంచన్ దొరా నీ కాల్ మొక్త అన్న పేద జనాన్ని గడప దాటని స్త్రీలను వీధుల్లో పోరాడే దశకు చేర్చిందని అన్నారు. బక్కజిక్కిన పేదలతో బందూకులు పట్టించి విప్లవ భావాలు పండించిన  నిప్పులకొలిమి ఐలమ్మ అని కొనియాడారు. 
ముడతలు పడిన ముఖంలొ వెలుగులు చిమ్మే కండ్లు... మెుక్కవోని ధైర్యం ఆమె సొంతం...తనయింటిని కమ్యూనిస్టు పార్టి కార్యాలయంగా మార్చి వీరాధివీరులకు అండగా నిలబడ్డదని, పోరాటాన్ని పదునెక్కించిన కామ్రేడ్ ఐలమ్మ అని కొనియాడారు. విసునూరు రామచంద్రారెడ్డి పటేల్ పట్వారి జాగీర్దార్లకు కులాల వారీగా వృత్తులు చేయాలని నిబంధనలను సామాజిక అణచబడ్డ వారందరినీ ఏకం చేసింది తెలంగాణ సాయుధ పోరాట గట్టమని తెలిపారు. నేటికీ గ్రామాలలో భూమిలేని నిరుపేదలు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల పేదలకు భూమి కొరకు పోరాడుదామని పిలుపునిచ్చారు. ఆమె స్పూర్తితో  సామాజిక అణిచివేతలను వర్గ పోరాటాలను నిర్మించాలన్నారు.

ఈ కార్యక్రమంలో  సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జీ. దామోదర్ రెడ్డి, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె. ధర్మేంద్ర,ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి సల్మాన్ బేగ్, టి. సత్య ప్రసాద్, ఏఐఎస్ఎఫ్ నేత మహేష్ పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post