దసరా రోజున ఆటోడ్రైవర్లకు రూ.15,000: ముఖ్యమంత్రి.
ఆంధ్ర ప్రదేశ్ అనంతపురంలో జరిగిన,సూపర్ సిక్స్-సూపర్ హిట్' సభ వేదికగా సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. దసరా రోజున ఆటోడ్రైవర్లకు వాహనమిత్ర కింద రూ.15వేలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. అటు ఉచిత బస్సు స్కీమ్ సూపర్ హిట్ అయిందని, * ఇప్పటికే 5 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని తెలిపారు. 'అన్నదాత సుఖీభవ' కింద తొలి విడతలో 47 లక్షల మంది రైతులకు నిధులు జమ చేశామని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.