తెలుగు భాషా అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు మండలి వెంకట కృష్ణారావు శతాబ్ జయంతి వేడుకలు.
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి.
చెన్నై:
తెలుగుజాతి గర్వించదగ్గ స్థాయిలో తెలుగు భాషా అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడు మండలి వెంకట కృష్ణారావు అని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు. ఆదివారం చెన్నై మైలాపూర్లో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ వారిచే మండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ముఖ్య విశిష్ట అతిథి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ద్వారా మండలి వెంకట కృష్ణారావు తెలుగు రాష్ట్రంతో పాటు రాష్ట్రేతర ఆంధ్రులను, ప్రపంచ దేశాల్లో స్థిరపడిన తెలుగువారిని ఒకే వేదికపైకి తీసుకొని వచ్చి తెలుగు భాషీయుల స్థాయి ఔన్నత్యం ప్రపంచానికి చాటిచెప్పారన్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధికార భాషా కమిషనుకు మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా కమిషన్ అని నామకరణం చేయటం ద్వారా తెలుగు భాష కోసం మండలి వెంకట కృష్ణారావు చేసిన కృషికి సముచిత గుర్తింపు, గౌరవం లభించాయన్నారు.
ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవనంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆధునీకరించిన గ్రంథాలయాన్ని అవనిగడ్డ శాసన సభ్యులు మండలి బుద్ధప్రసాద్ పునః ప్రారంభించారు.
ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి, మండలి వెంకట కృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా డాక్టర్ సి.ఎమ్.కె. రెడ్డి, ఆత్మీయ అతిథిగా భువన చంద్ర విచ్చేశారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ అధ్యక్షులు కాకుటూరు అనిల్ కుమార్ రెడ్డి, కార్యదర్శి & కోశాధికారి వి.కృష్ణారావు సంయుక్త కార్యదర్శి వూరా శశికళ, సభ్యులు డాక్టర్ విస్తాలి శంకరరావు, భువనచంద్ర, డాక్టర్ ఎం.వి. నారాయణగుప్తా, ఎం.ఎస్. లక్ష్మణరెడ్డి, డాక్టర్ మాడభూషి సంపత్ కుమార్, గుడిమెట్ల చెన్నయ్య, డాక్టర్ ఎ.వి. శివకుమారి, జె.ఎం. నాయుడు పాల్గొన్నారు.
