నేపాల్ ప్రధానిగా బలేంద్ర షా..?
సోషల్ మీడియాపై బ్యాన్ ఏకంగా నేపాల్ ప్రభుత్వాన్ని కుదిపేసింది. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రధాని కేపీ శర్మ ఓలీ, అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్తో సహా మంత్రులు, ముఖ్య నేతలు రాజీనామాలు చేశారు. ఈ క్రమంలో కొత్త ప్రధానిగా నేపాల్ మేయర్ బలేంద్ర షా పేరు తెరపైకి వచ్చింది. బలేంద్ర షానే.. నేపాల్కు కాబోయే ప్రధాని అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.
