ఓటమిపై స్పందించిన సుదర్శన్ రెడ్డి.
ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితంపై ఇండీ కూటమి అభ్యర్థి బి.సుదర్శన్ రెడ్డి స్పందించారు. 'ఫలితాలు నాకు అనుకూలంగా రాలేదు. ప్రజాస్వామ్యంలో గెలుపే కాదు.. ఓటమినీ స్వీకరించాలి. మరింత బలంగా సైద్ధాంతిక పోరాటం కొనసాగిస్తా' అని తెలిపారు. కాగా ఫలితాల్లో NDA అభ్యర్థి రాధాకృష్ణన్కు 452, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి.
