కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ పథకం "సూర్య ఘర్ " పై సమీక్ష సమావేశం.
పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కలెక్టరేట్ నందు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ పథకం "సూర్య ఘర్ " పై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు సమీక్ష సమావేశంలో విద్యుత్ శాఖ అధికారులు, వెండర్స్ తో సోలార్ ప్యానల్స్ అమరిక గురించి, అమలులోని లోటుపాట్లపై చర్చించడం జరిగింది.
అధికారులు, వెండర్స్, బ్యాంకర్ల సమన్వయంతో ప్రజలకు సోలార్ వినియోగంపై అవగాహనా కల్పించి పథకాన్ని మరింత సమర్థవంతంగా చేయాలని ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు*తెలిపారు
ఈకార్యక్రమంలో జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు అధికారులు పాల్గొన్నారు.
