అట్టహాసంగా రామాపురం సొసైటీ బ్యాంక్ చైర్మన్ మరియుసభ్యుల పదవి స్వీకరణ కార్యక్రమం.
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు )
* సొసైటీ సహకార సంఘాల ద్వారా రైతులకు మేలు చేయాలి
* ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ అమలు చేశాం
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పదవి అంటే అలంకరణ కాదు బాధ్యత అని సొసైటీ సహకార సంఘాల ద్వారా రైతులకు మేలు చేయాలి ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ అమలు చేశాం.
* పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని పొగాకు కొనుగోలు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
*
* రాచర్ల మండలం, రామాపురం సొసైటీ బ్యాంకు చైర్మన్ మరియు సొసైటీ సభ్యుల పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు.
* గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గోనగా గ్రామ నాయకులు పూలమాల శాలువాలతో ఘన స్వాగతం పలుకుతూ సహకార సంఘ బ్యాంకు వరకు ర్యాలీ నిర్వహించారు..
అనంతరం రామాపురం సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా భవనం పుల్లారెడ్డి మరియు మెంబర్లుగా మధిరె ఈశ్వర్ రెడ్డి, బోగోలు నారాయణ గార్లు తమ పదవీ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పూలమాల శాలువా వేసి శుభాకాంక్షలు తెలియజేశారు.,*
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేశామని, రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, నియోజకవర్గంలోని పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
* అందులో భాగంగానే గుడిమెట్ల పంచాయతీ మరియు ఇతర ప్రాంతాల్లో రైతుల వద్ద పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. నూతన బాధ్యతలు చేపట్టిన చైర్మన్ మరియు త్రిమెన్ కమిటీ సభ్యులు గ్రామాల్లోని రైతులకు ప్రభుత్వం కల్పించే అవకాశాలను వివరించి వారికి మేలు చేయాలని సూచించారు. గతంలో రైతుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డి, మోటార్లకు మీటర్లు బిగించాడని, ఎరువుల ధరలు 100 శాతం పెంచాడని, గత ఐదేళ్లలో రైతులకు పంట నష్టపరిహారం ఒక్కరికైనా అందించాడా అని ప్రశ్నించారు
* ఈరోజు కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కృషి చేస్తుంటే వైసీపీ పాలకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ మొసలి కన్నీరు కార్చటం విడ్డూరమన్నారు.
* నియోజకవర్గంలో ఎటువంటి యూరియా కొరత లేదని, రైతులకు అవసరమైన యూరియా కూటమి ప్రభుత్వం సంవృద్దిగా అందిస్తుందన్నారు. ఎక్కడైనా యూరియా అక్రమ నిల్వలు ఉంచితే వారి పై కఠిన చర్యలు తప్పవన్నారు.
కులం కార్డుతో ఎన్నికల ముందు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని నమ్మి అభివృద్ధి చేసే నాయకులను దూరం చేసుకోవద్దని, ప్రజలకు మేలు చేసే కూటమి ప్రభుత్వాన్ని ఆదరించి గ్రామాల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి సహకారం అందించాలన్నారు.
