బలవర్ధక ఆహారంతో బహుళ ప్రయోజనాలు వాల్ పోస్టర్ ఆవిష్కరణ.





బలవర్ధక ఆహారంతో బహుళ ప్రయోజనాలు వాల్ పోస్టర్ ఆవిష్కరణ.
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు) 

 ప్రకాశం జిల్లా కంభం మండలంలో విద్యాశాఖ కార్యాలయంలో ఫోర్టిఫైడ్ ఆహారం ఆరోగ్యానికి సోపానం అంటూ విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ వారు సమాజంలో అవగాహన కలిగిస్తున్నారు. కంభం విద్యాశాఖ  కార్యాలయంలో సంబంధిత వాల్ పోస్టర్లను ఎంఈవో-2 ఆధ్వర్యంలో శ్రీనివాసులు,ఫౌండేషన్ ప్రోగ్రాం అసోసియేట్ శ్యాంబాబు అధ్యక్షతన ఆవిష్కరించారు.టాటాట్రస్ట్స్ వారి సహకారంతో సమాజంలో ఆరోగ్య అవగాహన కలిగించేందుకు విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ వారు ఈ బృహత్కార్యాన్ని చేపట్టినట్లు తెలిపారు. 
ఫోర్టిఫైడ్ ఆహార పదార్థాల్లో ఐరన్,విటమిన్ A, బి 12, ఫోలిక్ యాసిడ్ తదితర పోషకాలు లభిస్తాయని, బియ్యం, ఉప్పు,నూనె,పాలు తదితర ఆహార ఉత్పత్తుల కొనుగోలు సమయంలో +ఫ్ గుర్తు వున్న వాటినే కొనుగోలు చేయాలన్నారు.మండలంలోని అన్ని పాఠశాలల్లో గోడపత్రాలను అంటించి అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఆర్పీలు, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post