లేడి డాన్....అరుణ అరచకాలు మామూలుగా లేవుగా.. ఏకంగా గన్నుతోనే బెదిరించింది.. మరో కేసు నమోదు!




లేడి డాన్....అరుణ అరచకాలు మామూలుగా లేవుగా.. ఏకంగా గన్నుతోనే బెదిరించింది.. మరో కేసు నమోదు!

నెల్లూరు లేడీ డాన్‌ నిడిగుంట అరుణ మెడకు ఉచ్చు మరింత బిగుస్తోంది..ఆమెపై వరస కేసులు నమోదవుతున్నాయి తాజాగా మరో కేసు నమోదవ్వడం కలకలం రేపుతోంది. 
నెల్లూరుకు చెందిన అరుణపై మరో కేసు నమోదైంది.. అన్నదమ్ముల ఆస్తివివాదంలో తలదూర్చి గన్‌తో తనను బెదిరించారని బాధితుడు శశికుమార్ ఫిర్యాదు మేరకు.. నవాబుపేట పోలీసులు అరుణపై కేసు నమోదు చేశారు. అరుణ అనుచరులు అరుగురిని విచారించిన కోవూరు పోలీసులు.. మరిన్ని వివరాలు సేకరించారు. అరుణ దందాలపై ఆమె అనుచరులు పల్లం వేణు, అంకిం రాజా, షేక్ అప్సర్, షేక్ మునీర్, మచ్చకర్ల గణేష్, ఎలిషాలను కోవూరు CI సుధాకర్ రెడ్డి విచారించారు. అరుణతో కలిసి చేసిన నేరాలు, బెదిరింపులు, దందాల గురించి ఆరాతీశారు. కాగా.. ఇప్పటికే సాయి అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌ను ఆక్రమించిన కేసులో అరుణతో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కి పంపించారు. కోర్టు14 రోజుల రిమాండ్ విధించగా.. రేపటితో ముగియనుంది.. దీంతో పోలీసులు మళ్లీ ఆమెను అదుపులోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది.

Post a Comment

Previous Post Next Post