ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవనివంటిది - ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి.



ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవనివంటిది - ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి.


అనారోగ్యంతో బాధపడేవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవనివంటిదని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. సీఎం రిలీఫ్‌ఫండ్‌తో ఎంతోమంది బాధితుల జీవితాల్లో ఆర్ధిక భరోసా నింపుతున్నామన్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. తమ అనారోగ్య పరిస్థితులను వివరిస్తూ ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతులందించిన వారికి త్వరితగతిన సిఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్ధిక సాయం అందించేందుకు ఎమ్మెల్యే బడేటి చంటి చూపుతోన్న చొరవ ప్రశంసనీయంగా నిలుస్తోంది. ఇదేక్రమంలో బుధవారం ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 22 మంది లబ్దిదారులకు 8లక్షల 58వేల 189రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి,,, వారికి భరోసా కల్పించారు. అలాగే 10లక్షల 50వేల రూపాయల విలువైన రెండు ఎల్‌వోసిలను అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే చంటి,,, పేదవారికి ఆర్ధిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీనిలో భాగంగానే ఇప్పటివరకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 3కోట్ల 20 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను లబ్దిదారులకు అందజేశామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఆర్ధిక సాయం అందించే విషయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవనిలా ఉపయుక్తంగా నిలుస్తోందన్న ఎమ్మెల్యే చంటి,,, భవిష్యత్తులో మరింత మంది అవసరార్థులకు ఆర్ధిక సాయం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈడా ఛైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, కో - ఆప్షన్‌ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్సెమ్మార్‌ పెదబాబు మరియు వివిధ హోదాలలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.





















Post a Comment

Previous Post Next Post