ఏలూరు 21, 22 వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సత్రంపాడు లో అన్నదాన కార్యక్రమం.
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏలూరు నియోజకవర్గం 21, 22 డివిజన్ కమిటీ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గారు, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.. అనంతరం కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జీ పేటేటి రామకృష్ణ ప్రసాద్, డివిజన్ ఇంచార్జీ కన్న ప్రసాద్, మరియు 21, 22 వ డివిజన్ కమిటీ సభ్యులు మరియు వివిధ హోదాల్లో ఉన్న కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, మెగా అభిమానులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు.
