ఏలూరు గాంధీ మైదానం వద్ద జనసేన స్థూపం ఆవిష్కరణ.
ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించిన ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, జనసేన నాయకులు నారా శేషు.
జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఏలూరు 17 వ డివిజన్ పడమర వీధిలోని గాంధీ మైదానం వద్ద 17 వ డివిజన్ ఇంచార్జీ లక్కింశెట్టి కిరణ్ కుమార్ మరియు వారి యొక్క కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చంటి , ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు , జనసేన నాయకులు నారా శేషు నగర ప్రముఖులు హాజరయ్యారు.. తొలత గాంధీ మైదానం వద్ద 17 వ డివిజన్ జనసైనికులు ఏర్పాటు చేసిన జనసేన స్థూపాన్ని బడేటి చంటి, రెడ్డి అప్పల నాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని కేక్ కట్ చేసి అభిమానులతో కలిసి ఆనందం పంచుకున్నారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – “ప్రజల ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకం మనందరికీ శక్తి, స్ఫూర్తిని ఇస్తాయని అన్నారు.. ప్రజాసేవే మా కూటమి ప్రభుత్వం లక్ష్యం” అని పేర్కొన్నారు. ఈ వేడుకలో ఎఎమ్సీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి , పెద్దలు మధ్యాహ్నపు బలరాం , మాజీ డిప్యూటీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్ , ప్రముఖ వ్యాపారవేత్త కొట్టు మధు , కొట్టు మనోజ్, మాజీ ఎఎమ్సీ చైర్మన్ పూజారి నిరంజన్ ,జనసేన జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు వీరంకి పండు, పలువురు కూటమి పార్టీల నాయకులు, నగర ప్రముఖులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు విస్తృతంగా పాల్గొని పుట్టినరోజు వేడుకలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలలో 17 వ డివిజన్ కమిటీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

