ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు.
ఏలూరు, ఆగస్టు2:- రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలను ఏలూరులో ఘనంగా నిర్వహించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు,మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి హాజరయ్యారు. తొలుత పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికుల సమక్షంలో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ మన ప్రియతమ నేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే ప్రజా నాయకుడు అని కొనియాడారు. అటువంటి గొప్ప నాయకుడు పుట్టినరోజును పురస్కరించుకొని ఏలూరులో ఈరోజు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మన నాయకుడిని ఆదర్శంగా తీసుకుని, ప్రజాక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, జనసైనికులు అందరూ మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈరోజు పలు సేవా కార్యక్రమాలు, పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలు, విజయరాయి లో మెగా రక్తదాన శిబిరం, సోషల్ సర్వీస్ మురళి కృష్ణ గారి ఆధ్వర్యంలో స్కాలర్ షిప్ పంపిణీ కార్యక్రమం, సుధా బత్తుల శ్రీదేవి గారి ఆధ్వర్యంలో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం, శనివారపు పేటలో తోట పుష్ప గారి ఆధ్వర్యంలో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం, మార్కండేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, పోస్టల్ కాలనీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, గాంధీ మైదానం వద్ద జనసేన పార్టీ స్తూపం ఆవిష్కరణ జరుగుతుందన్నారు. కావున ఈ కార్యక్రమాల్లో జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.. అంతేకాకుండా సాయంత్రం వరకు పలు డివిజన్లో కేక్ కటింగ్ కార్యక్రమం, మొక్కలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందన్నారు.. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర గౌరవ ఉపముఖ్యమంత్రి, పంచాయితీ రాజ్, గ్రామీణ - అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి, పర్యావరణ - అటవీ సైన్స్ & టెక్నాలజీ శాఖ మంత్రి, ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ పరిరక్షకుడు, మన అందరి జనహృదయనేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, ఏలూరు నగర అధ్యక్షులు వీరంకి పండు, జనసేన నాయకులు సరిది రాజేష్, నగిరెడ్డి కాశీ నరేష్, దోనేపూడి లోవరాజు, ఎట్రించి ధర్మేంద్ర, రెడ్డి గౌరీ శంకర్,దోసపర్తి రాజు కూనిశెట్టి మురళీకృష్ణ, బోండా రాము నాయుడు,వీర మహిళలు కావూరి వాణిశ్రీ, తుమ్మపాల ఉమా దుర్గ,కొసనం ప్రమీల, యడ్లపల్లి మమతా వివిధ హోదాల్లో ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
