టెంకాయలతో మొట్టమొదటిసారిగా వినాయకుని ప్రతిమ.
తిరుపతి రూరల్ (క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దిలీప్)
తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామపంచాయతీ, తారకరామా నగర్ లో కలశం మరియు టెంకాయలతో వినూత్న రీతిలో పర్యావరణానికి హాని కలగకుండా వినాయకుని ప్రతిమ మొట్టమొదటిసారిగా టెంకాయలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఐదు రోజులు పాటు జరిగిన వినాయక చతుర్థి కార్యక్రమాలలో ప్రజలు భక్తిశ్రద్ధలతో పాల్గొని వైభవంగా జయప్రదం చేశారు. కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, ముగ్గుల పోటీలు భక్తులను ఎంతగానో అలరించాయి. అనంతరం సాంప్రదాయమైన మేళ తాళాలతో, కోలాటాలతో విగ్నేశ్వరుని ఊరేగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షులు దిలీప్, ప్రెసిడెంట్ మురళి, శివ, శ్రీ హర్ష, కేతన్, హరి, రెడ్డి, జస్వంత్, శ్రావణ్, తరుణ్, మదన్ మొదలైన వారు పాల్గొన్నారు.
