కష్ట సుఖాల్లో తోడుగా ఉన్న సోమయ్య వెంటే ఉంటాము - ముఠా కార్మికులు.



 కష్ట సుఖాల్లో తోడుగా ఉన్న సోమయ్య  వెంటే ఉంటాము - ముఠా కార్మికులు.


 మా ముఠా కార్మికులకు యూనియన్ పెట్టి, రేట్లు పెంచి, గత పాతిక సంవత్సరాలుగా మా కష్ట సుఖాల్లో తోడుగా ఉన్న సోమయ్య  వెంటే ఉంటామని ఏలూరు సత్రంపాడుకు చెందిన మార్బుల్స్ ముఠా వర్కర్లు, గ్యాస్ గోడౌన్ వర్కర్లు, టిప్ టాప్ ముఠా వర్కర్లు 20 మంది అందరూ నేడు ప్రతిజ్ఞ చేశారు. 40 సంవత్సరాలు నిస్వార్థ సేవ చేసిన సోమయ్యను పార్టీ నుండి వెల్లగొట్టడం చాలా అన్యాయం అని అన్నారు. ఈ మేరకు వారు స్థానిక సత్రంపాడు మార్బుల్స్ షాపుల వద్ద అందరూ సోమయ్య తోనే ఉంటామనితెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేస్త్రి సుంకర సూర్యనారాయణ, కిలారి అప్పారావు, మరియు కార్మికులు సారిక సీతం నాయుడు, కోరాడ సన్యాసిరావు, జి.గోవిందు, ఇద్ధిబింది లక్ష్మణ్ రెడ్డి, బోయిన దిబ్బరాజు, లంకలపల్లి జగదీష్, మెంటాడ సత్యనారాయణ తదితరులు నేడు పత్రికల వారికి తెలియజేశారు.

Post a Comment

Previous Post Next Post