ప్రజలకి ముఖ్యమైన హెచ్చరిక సైబర్ నేరాల పై అవగాహన కలిగి ఉండాలని ఏలూరు జిల్లా సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ దాసు గారు వెల్లడి.


 ప్రజలకి ముఖ్యమైన హెచ్చరిక సైబర్ నేరాల పై అవగాహన కలిగి ఉండాలని ఏలూరు జిల్లా సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ దాసు గారు వెల్లడి.

ఏలూరు జిల్లా ఎస్‌పీ కె.ప్రతాప్ శివ కిషోర్ IPS ఏలూరు డిఎస్పి శ్రీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల పై ఏలూరు జిల్లా సైబర్ సెల్ ఇన్స్పెక్టర్

శ్రీ జి. దాసు గారు ప్రజలకు ముఖ్యమైన సూచనలు ఇచ్చారు.

👉 *ప్రస్తుత కాలంలో పెరిగిన సైబర్ నేరాల*

👉 సైబర్ నేరగాళ్లు విద్యార్థుల తల్లితండ్రులకు ఫోన్ చేసి, “మీకు స్కాలర్షిప్ వచ్చింది. మీరు రూ.10,000 పంపకపోతే స్కాలర్షిప్ రాదు” అని భయపెడుతూ డబ్బులు స్వాధీనం చేస్తున్నారు.

👉 పోలీస్ డ్రెస్ లో వీడియో కాల్ చేసి, డ్రగ్స్ కేసులు లేదా మహిళల ట్రాఫికింగ్ కేసులు మీపై నమోదయ్యాయని చెప్పి, డబ్బులు లెక్కించి తీసుకుంటున్నారు.

👉 WhatsApp అకౌంట్ హ్యాక్ చేసి, మీ కాంటాక్ట్స్ కు ఏపీకే (APK) లింక్స్ పంపి, డబ్బులు తీసుకుంటున్నారు.

👉ATMs వద్ద కొందరు నేరస్తులు మిమ్మల్ని టార్గెట్ చేసి, ఒరిజినల్ కార్డు మారుస్తూ డూప్లికేట్ కార్డు ఇచ్చి, మీ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు తీసుకుపోతున్నారు.

👉కొందరు నేరగాళ్లు Instagramలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి, Friend Request ద్వారా స్టూడెంట్స్ ను టార్గెట్ చేస్తూ, న్యూడ్ ఫొటోలు పంపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

👉eChallan Pending” అని RT0 పేరు మీద లింక్స్ పంపించి, వాటిని ఓపెన్ చేయమని చెబుతూ, డబ్బులు వసూలు చేస్తున్నారు.

ప్రజల కోసం ముఖ్యమైన సూచనలు:

➡️ తెలియని నెంబర్ నుండి వచ్చిన కాల్స్ ఎప్పుడూ లిఫ్ట్ చేయవద్దు.

➡️ APK లింక్స్ ఓపెన్ చేయవద్దు.

➡️పోలీస్ డ్రెస్ లో ఎవరు కాల్ చేసినా భయపడకూడదు.

➡️ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ పై ఎలాంటి Friend Request ని అంగీకరించ వద్దు

➡️ఎప్పుడూ అధికారిక వెబ్‌సైట్ లేదా రికగ్నైజ్డ్ అప్లికేషన్స్ ద్వారా eChallan వివరాలు చెక్ చేసుకోవాలి.

ఏలూరు జిల్లా సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ గారి ప్రత్యేక సూచన:

ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి, అవగాహన పెంచుకొని సైబర్ నేరాలపైన సరైన సమాచారం పొందాలి.

భద్రత మన బాధ్యత.

👉 ఎటువంటి సందేహాలైనా ఉన్న దగ్గర్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లేదా డయల్ 112 నెంబర్ కు ఫోన్ చేయండి.

👉 ఎవరైనా సైబర్ నేరానికి గురైన వెంటనే 1930 కి సమాచారం అందించిన ఎడల వెంటనే సహాయ సహకారాలను అందిస్తారని ఏలూరు సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ గారు తెలియ చేసినారు

Post a Comment

Previous Post Next Post