దళిత మహిళలకు రాజ్ ట్రస్ట్ సేవలు ఎస్సీ సెల్ నాయకుడు కాకిలేటి.
నరసాపురం (క్రైం 9 మీడియా ప్రతినిధి)
పేదలు, మహిళల ఆర్థిక అభివృద్ధికి ఎంతగానో పనిచేస్తున్న రాజ్ ట్రస్ట్ తమ సేవలను మరింత విస్తృత పరచాలని నరసాపురం ఎస్సీ సెల్ నాయకుడు కాకిలేటి ఆనంద్ కుమార్ అన్నారు. బుధవారం నరసాపురం మండలం చిత్తవరం గ్రామంలో జరిగిన సభలో కాకిలేటి ఆనంద్ కుమార్ మాట్లాడారు. రాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొంది, చిట్టవరం గ్రామాలలోని 28 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ట్రస్ట్ నిర్వహకులు గంటా రాజ్ కుమార్, గంటా సుందర్ కుమారులు మాట్లాడుతూ ఇప్పటివరకు తమ ట్రస్టు ఆధ్వర్యంలో ఆంధ్ర, ఒరిస్సా తెలంగాణ రాష్ట్రాలలోని రెండు వేలకు పైగా మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశామన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాడి లక్ష్మణరావు, గ్రామ ప్రముఖులు చల్లా సత్యనారాయణ, కోళ్ల శ్రీనివాస్, కాకిలేటి ఆనందకుమార్, కోపల్లి శ్రీనివాస్, రేవు ప్రభుదాస్, గ్రంధి శ్రీనివాస్, పైడికొండల కృష్ణ,
