భార్యపై భర్త అమానుష దాడి.. ప్రకాశం పోలీస్ సీరియస్ యాక్షన్.




భార్యపై భర్త అమానుష దాడి.. ప్రకాశం పోలీస్ సీరియస్ యాక్షన్.


ఇప్పటికే ఇద్దరి అరెస్ట్.. కుటుంబ సభ్యుల కోసం గాలింపు.

ఘటన తెలిసిన వెంటనే.. రంగంలోకి పోలీస్.

బాధిత మహిళను వైద్యశాలకు స్వయంగా తరలించిన పోలీస్లు.

ప్రకాశం జిల్లా 

తర్లపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామం ఎస్టి కాలనీ చెందిన గురునాథం భాగ్యలక్ష్మి అనే మహిళపై భర్త బాలాజీ దాడి చేసిన ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోలీసులు తక్షణం స్పందించారు. సమాచారం అందుకున్న వెంటనే దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ, పొదిలి సిఐ వెంకటేశ్వర్లు, తర్లుపాడు పాడు ఎస్సై బ్రహ్మనాయుడు సంఘటన ప్రదేశానికి వెళ్లి బాధితురాలను పరామర్శించి సదర్ మహిళను హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

 సుమారు 12 సంవత్సరాల క్రితం వివాహమైనట్లు, వారికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు సంతానం అయినట్లు, గురునాథం భాగ్యలక్ష్మి కలుజువ్వలపాడు గ్రామములోని బేకరీ నందు పనిచేస్తున్నట్లు, గురునాథం భాగ్యలక్ష్మి భర్త బాలాజీకి మద్యం తాగే అలవాటు ఉన్నట్లు, గురునాథం భాగ్యలక్ష్మిని అనుమానిస్తున్నట్లు ఉన్నట్లు, తేది.13.09.2025న రాత్రి షుమారు 09:30 సమయంలో గురునాథం భాగ్యలక్ష్మి కలుజువ్వలపాడు గ్రామము లోని బేకరీలో పని ముగించుకొని ఇంటికి వెళుతుండగా, మార్గ మధ్యలో గురునాథం భాగ్యలక్ష్మి భర్త బాలాజీ అతని కుటుంబ సభ్యులు కలిసి ఆమెను ఇంటికి తీసుకువెళ్లి చేతులు కట్టేసి బెల్ట్ తో వీపు పై కొట్టి, కాళ్ళతో, చేతులతో కొట్టినారు. మహిళలపై దాడులు చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయని ఈ సందర్బంగా దర్శి డి ఎస్ పి లక్ష్మీనారాయణ తెలియపరిచారు.

Post a Comment

Previous Post Next Post