ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆపన్న హస్తం.
పెదవేగి ..పేద బడుగు బలహీన వర్గాలకు అన్ని విధాల అండగా ఉండడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ తెలిపారు ఆపదలో అపన్న హస్తం అందిస్తూ నియోజకవర్గ పరిధిలోని పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన దాదాపు రూ.15లక్షల రూపాయల CMRF చెక్కులను బాధితులకు అందజేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్దు దుగ్గిరాల లోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పలువురు నియోజకవర్గ కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాలు అందించారు.. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు పత్రాలను స్వీకరించిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులు ఆదేశాలు జారీ చేశారు.అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న నియోజకవర్గ పరిధిలోని దెందులూరు మండలం, ఏలూరు రూరల్ మండలంలోని పలువురు బాధితులకు అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వారికి మంజూరు అయినా రూ. 15 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. పేద బడుగు బలహీన వర్గాల కోసం అభివృద్ధి సంక్షేమ పాలన అందించడంతోపాటు అనారోగ్య ఆపదల వంటి పరిస్థితుల్లో కూడా వారికి కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.
