ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (AITUC) విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ నిరసన ధర్నా.




  ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్  (AITUC) విజయవాడ ఆటో వర్కర్స్ యూనియన్ నిరసన ధర్నా.

 విజయవాడ

స్త్రీ శక్తి పథకం వలన జీవనోపాధి కోల్పోతున్న ఆటో కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సెప్టెంబర్ 15వ తేదీన విజయవాడలో రవాణా శాఖ మంత్రి కార్యాలయం ముందు నిరసన ధర్నా.
రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న ఆటో కార్మికుల జీవితాలకు ఉపాధి కరువై భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారింది-అధ్యక్షులు దోనేపూడి శంకర్.గత ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని జీవో నెంబర్ 21ను రద్దు చేస్తామని దాని స్థానంలో కొత్త జీవో, తెస్తామని, కార్మికులకు హెల్త్ మరియు ప్రమాద బీమా సౌకర్యం కలుగజేస్తామని, వాహన మిత్ర పథకం ద్వారా సంవత్సరానికి 16 వేల రూపాయలు ఆర్థిక సహాయం ఆటో కార్మికుల పిల్లలకు ఉన్నత విద్యకు విద్య గుణాలు అందిస్తామని స్వయంగా చంద్రబాబునాయుడుగారు వాగ్దానాలు చేయటం జరిగింది. 
అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిన ఈనాటి వరకు హామీలు ఆచరణకు నోచుకోలేదు.

ఇటీవల కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన శ్రీ శక్తి పథకం సగటు పౌరులుగా స్వాగతిస్తున్నాం. 
ఇదే సందర్భంలో ఇప్పటికి అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ఇంధన ధరలు నిబంధన పేరుతో అధికారిక వేధింపులు (ప్రైవేటు ఫైనాన్స్ దోపిడీ ఆన్లైన్ బుకింగ్స్ పేరుతో ఓలా రాఫిర్ బుకింగ్స్ ఆటో కార్మికులను పట్టిపీడిస్తున్నాయి. ఇప్పటికీ ఆటో కార్మికుల పట్ల వారి జీవనోపాధిపట్ల ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించలేదు. 

నెలకు 5000 రూపాయలు ఆటో కార్మికులకు పింఛన్ రూపంలో మంజూరు. చేయాలని డిమాండ్ చేస్తున్నాము. బ్యాడ్జితోసంబంధం లేకుండా వాహన మిత్ర పథకం మంజూరు చేసి ఆటో కార్మికుల జీవనోపాధిని డిమాండ్ చేస్తున్నాం. సెప్టెంబర్ 16వ తేదీన ఆటో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ విజయవాడ నగరంలో రవాణా శాఖ మంత్రి కార్యాలయం ముందు జరిగే నిరసన ధర్నాలో రాజకీయాలకతీతంగా ఆటో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఏఐటీయూసీ అనుబంధ ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దోనేపూడి శంకర్ విజ్ఞప్తి చేశారు.


Post a Comment

Previous Post Next Post