బదిలీపై వెళుతున్న ఎంఈవోకు ఘనంగా సన్మానం.


 

బదిలీపై వెళుతున్న ఎంఈవోకు ఘనంగా సన్మానం.

 (ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు )

ప్రకాశం జిల్లా కంభం మండలం: స్థానిక ఎంఈవో కార్యాలయంలో పూర్వ ఎంఈవో బి. మాల్యాద్రిని శుక్రవారం ఘనంగా సన్మానించారు. గత 3 సంవత్సరాలుగా కంభం ఎంఈవో-1 గా పనిచేసి బదిలీపై వెళ్ళిన ఆయన ఛార్జ్ అప్పగించిన సందర్భంగా వీడ్కోలు సభను ఘనంగా ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి మండలంలోని పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు.ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు హాజరై పూర్వ ఎంఈవో మాల్యాద్రిని దుశ్యాలవలతో. పూలమాలలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మంచితనానికి మారుపేరు మండల విద్యాశాఖాధికారి మాల్యది అని, అడ్మినిస్ట్రేషన్లో ఆయన తీరు అనిర్వచనీయమైనదని, అలుపెరుగని కార్యదక్షత, అంతులేని ఆత్మవిశ్వాసం ఆయనకు అలంకారమని కొనియాడారు. 

మండలంలోని పాఠశాలల నిర్వహణలో ఆయన శైలి అనుసరణీయమని,స్పూర్తిదాయకమని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఎంఈవోలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు, జంగంగుంట్ల కాంప్లెక్స్ చైర్మన్ గని. వెంకటేశ్వర్లు,ఏపీటీఎఫ్ మండల అధ్యక్షుడు సిహెచ్.భాస్కర్ నాయుడు, ప్రధానకార్యదర్శి రంగస్వామి, హబీబుర్ రెహమాన్, పసుపులేటి శ్రీనివాసులు,నడింపల్లి. హెచ్ఎం నాగరత్నమ్మ, శ్రీనివాస ఎయిడెడ్ స్కూల్ హెచ్ఎం ఎల్. శ్రీదేవి,దేవనగరం హెచ్ఎం.భారతి,ఏపీటీజీ సభ్యులు గోపిశెట్టి.శ్రీనివాసులు,వి. బాలలింగయ్య, సిఆర్పిలు, మండల సమన్వయకర్త చిన్ని పద్మావతి దేవి, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post