వెలుగొండ ప్రాజెక్టు ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజా బాబు, టీడీపీ ఇంచార్జ్ ఎరిక్షన్ బాబు.
(ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు )
*దోర్నాల:* ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద గల పూల సుబ్బయ్య.వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్ పనులను జిల్లా కలెక్టర్ రాజా బాబు, టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుతో కలిసి పరిశీలించారు. టన్నెల్ లోకి వెళ్లి పరిశీలించి ప్రాజెక్టు పనితీరుపై అధికారులతో మాట్లాడారు. అనంతరం వెలుగొండ గెస్ట్ హౌస్ లో అధికారులతో రివ్యూ కార్యక్రమం నిర్వహించారు.
ప్రాజెక్టు త్వరగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ కలెక్టర్, సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, జిల్లా అధికారులు, టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు.


