*పల్నాడు జిల్లా పిడుగురాళ్ల నుండి ఓడరేవు బైపాస్ పనులకు, రోడ్డు విస్తరణకు భూములు ఇచ్చిన బొప్పూడి, పసుమర్రు రైతులు ఆందోళన**
రోడ్డు పనులు చక చక కొనసాగుతూ ఉన్నాయి కానీ రైతులకు డబ్బులు మాత్రం ఇవ్వలేదని బొప్పూడి గ్రామము నుండి బైక్ ర్యాలీతో హైవే వద్దకు వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు.
నిరసన కార్యక్రమంలో రైతులతో కలిసి గళం విప్పిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం.
బొప్పూడి నుండి పసుమర్రు రహదారిలో నిరసన తెలియజేస్తూ పసుమర్తి నుండి వింజనంపాడు పోయే మార్గం మధ్యలో రోడ్డుపైన బైఠాయించి బైపాస్ పనులు చేపట్టే వారు వెంటనే రైతులకు న్యాయం చేయాలని రైతులతో కలిసి నిరసనలో పాల్గొని వారి కోసం మండు ఎండలో నినాదాలు చేసి, నిరసన చేపట్టిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం రైతు విభాగం నాయకులు గుర్రం నాగపూర్ణ చంద్ర రావు, అంబటి సోంబాబు, గుంటు కోటేశ్వరరావు. గుంటు హరిబాబు, నవతరం పార్టీ మహిళా నాయకురాలు షేక్ షమ్మీ, బత్తుల దానయ్య, బత్తుల శివ,బోప్పూడి, పసుమర్రు గ్రామ రైతులు పాల్గొని వెంటనే రైతులకు న్యాయం చేయాలని నిరసన తెలిపారు.
Editor sarat
Editor sarat

