కైకలూరులో ఎస్సీ మాల యువకులుపై జరిగిన దాడి దారుణం
- ఆర్.పి.ఐ.(అంబేద్కర్ పార్టీ)
ఏలూరు..ఈ నెల 5వ తారీఖున అజయ్ మరియు దినేష్ లపై జరిగిన దాడి పట్ల రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్ పార్టీ )రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మత్తే బాబి ప్రభుత్వ భోధన ఆసుపత్రిలో వారిని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు,
బాధితులను కలిసి వారి దాడిని గురించి పూర్తి వివరాలు తెలుసుకుని ఆ విషయమై స్థానిక కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారితో నేరుగా ఫోన్లో మాట్లాడి బాధితులు న్యాయం చేయాలని కోరగా ఆయన స్పందించి న్యాయం చేస్తానని తెలిపారు.
ఎస్సీలపై ఇటువంటి దాడులు జరగడం దురదృష్టకరం అని భవిష్యత్తులో ఇటువంటివి పునరావృత్తం కాకూడదని ఆర్.పి.ఐ అంబేద్కర్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మత్తే బాబి అన్నారు,ఈ కార్యక్రమంలో జై భీమ్రావు పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు గొల్ల నరేష్ బాబు, జై భీమ్ ఆర్మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిడిగట్టి సుధీర్ బాబు, వీరబత్తిన సుధా,ఎరికిపాటి విజయ్ తదితరులు పాల్గొన్నారు.
