ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర సమావేశం విజయవాడలో మినర్వా గ్రాండ్ హోటల్లో జరిగింది.






ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర సమావేశం విజయవాడలో మినర్వా గ్రాండ్ హోటల్లో జరిగింది.


• *ఈ సమావేశానికి గౌరవాధ్యక్షుడు శ్రీ గోకరాజు గంగరాజు గారి అధ్యక్షతన  ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీ నారా శేషు గారు పాల్గొన్నారు...*

ఈ సమావేశంలో గౌరవాధ్యక్షుడు శ్రీ గోకరాజు గంగరాజు గారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము అద్భుతమైన సహకారం అందించిందని అదేవిధంగా రాష్ట్ర కమిటీ కింది వరకు సమితులు ఏర్పాటు చేసి చక్కటి కృషి చేసి గణేశ ఉత్సవాలను విజయవంతం చేసిందని వారు సమితిని అభినందించారు.
    జిల్లా సమితులు జిల్లాలో ఉన్న అధికారులను కలిసి సమన్వయం చేసుకుంటూ మండపాల వారికి చక్కటి సహకారం అందించి ఉత్సవాలను విజయవంతం జరిగినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్దలని అధికారులను అధ్యక్షుడు శ్రీ చలసాని ఆంజనేయులు గారు, ఉపాధ్యక్షుడు శ్రీ రంగ ప్రసాద్ గారు ప్రత్యేక తీర్మానం ద్వారా అభినందించారు.

 జిల్లాల వారీగా జరిగిన పనిని సమీక్ష చేసి వారి నివేదికల ద్వారా జరిగిన పనిని ప్రధాన కార్యదర్శి శ్రీ పాకాల త్రినాథ్ గారు అభినందించారు. 
రాష్ట్ర సమితి నుండి జిల్లాలకు జెండాలు కండువాలు కరపత్రాలు తదితర పంపిన ఆర్థిక స్థితి నివేదికను కోశాధికారి శ్రీ కె.వి రమణ గారు ప్రవేశపెట్టారు. కార్యాచరణ కార్యదర్శి శ్రీ దుర్గాప్రసాద్ రాజుగారు చర్చించారు. 
జిల్లాల నుండి అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో శ్రీ గణేశుడికి నివేదన అనే పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు. 
ఈ సమావేశంలో పెద్దలు ఉపాధ్యక్షులు శ్రీ బీవీ రమణ కుమార్ గారు కార్యదర్శులు శ్రీ వేణుగోపాల్ గారు లక్ష్మీపతి గారు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వారీగా నివేదికలు అందించారు. 
నిమజ్జన సమయంలో ప్రమాదవశాత్తు చనిపోయిన రాష్ట్రంలోని 11 మందికి 50 వేల రూపాయలు చొప్పున ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ఆర్థిక సహాయం ని అందించుటకు నిర్ణయించినది.

Post a Comment

Previous Post Next Post