బలిజ సంఘం అధ్యక్షుడిగా సూరే ప్రసాద్.


 

బలిజ సంఘం అధ్యక్షుడిగా సూరే ప్రసాద్.


( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )

శ్రీకృష్ణ దేవరాయ బలిజ సేవా సంఘం కంభం, బెస్తవారిపేట, అర్దవీడు మండలాల కమిటీ, నూతన అధ్యక్షుడిగా, మాజీ సైనికోద్యోగి, సూరే ప్రసాద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు.


 ప్రకాశము జిల్లా కంభం పట్టణంలో శనివారం శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో, ఈ మేరకు, పాత అధ్యక్షులు, తోట కోటేశ్వరరావు, సూరే ప్రసాద్ ను, దుశ్శాలువతో సత్కరించి, బాధ్యతలు అప్పగించారు. 

ఈ సందర్భంగా పలువురు సంఘ పెద్దలు ప్రసాద్ ను అభినందించారు. 

వచ్చే నెల అక్టోబర్ 26న, కంభం చెరువు కట్టమీద జరగనున్న, 


బలిజ కార్తీక వనం భోజన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని అలాగే అందరూ సహకరించాలని ప్రసాద్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Post a Comment

Previous Post Next Post