శిరస్త్రం ధరించటం ప్రతీ ఒక్కరి బాధ్యత.
అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి హెల్మెట్లు పంపిణి.
విశిష్ట అతిధిగా పాల్గోన్న ఎమ్మెల్యే ముత్తుముల.
హెల్మెట్ ధరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. గిద్దలూరు పట్టణంలోని శ్రీ విట్టా సుబ్బరత్నం కళ్యాణ మండపంలో అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. బోనేని వెంకటేశ్వర్లు గారు గిద్దలూరు సర్కిల్ పరిధిలోని రాచర్ల, గిద్దలూరు, కొమరోలు పోలీసులకు హెల్మెట్లు, వాటర్ బాటిల్లు, టోపీలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులు మరియు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని. పోలీస్ సిబ్బందికి హెల్మెట్లు పంపిణి చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ హెల్మెట్ ధరించటం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, ప్రమాదం జరిగితే కుటుంబం అనాధ అవుతుందని, కావున యువత బైక్ లపై అతివేగంగా వెళ్ళటం చాలా ప్రమాదమని, తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.. అనంతరం గిద్దలూరు రూరల్, అర్బన్, సీఐ లు సురేష్, రామ కోటయ్య మరియు కంభం సీఐ మల్లిఖార్జున గార్లు మాట్లాడుతూ ఇటీవల ఓ కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదానికి గురై తలకు బలమైన గాయం కావడంతో మంచానికే పరిమితమయ్యాడని ఈ విషయం తెలుసుకున్న అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు స్పందించి రాచర్ల, కొమరోలు, గిద్దలూరు ప్రాంతాలలో మండలాలలోని పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 100 మందికి హెల్మెట్లు, వాటర్ బాటిల్లు, టోపీలు పంపిణీ చేశారన్నారని పోలీసు సిబ్బంది తప్పనిసరిగా నిబంధనలు పాటిస్తూ హెల్మెట్లు ధరించి వాహనాలు నడపాలని సిఐలు ఎస్సైలు సూచించారు. ప్రజలకు కూడా హెల్మెట్ ధరించి తలకు రక్షణ కల్పించుకోవాలన్నారు. అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో అమ్మ సేవా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని అన్నారు.
ఈ సందర్బంగా హెల్మెట్లు పంపిణి చేసిన అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బోనేని వెంకటేశ్వర్లు సేవలు అభినందనీయమని పోలీస్ శాఖ మరియు గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి అభినందించారు..
ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ అధ్యక్షులు సయ్యద్ శానేషా వలి, మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ బైలడుగు బాలయ్య, వైస్ చైర్మన్ గోడి ఓబుల్ రెడ్డి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాల ఈశ్వరయ్య, బిజ్జం రవీంద్రా రెడ్డి, రాష్ట్ర ఎడ్యుకేషన్ మరియు వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్. గోనా చెన్నకేశవులు, రాచర్ల మండల టీడీపీ నాయకులు అంబవరం శ్రీనివాసరెడ్డి మరియు పోలీస్ సిబ్బంది, టీడీపీ కౌన్సిలర్లు నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.

