పల్నాడు జిల్లా మెడికల్ కాలేజీ లను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ BSP నాయకులు మీడియా సమావేశం.


 

పల్నాడు జిల్లా మెడికల్ కాలేజీ లను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ BSP   నాయకులు మీడియా సమావేశం.


1.వైద్యవిద్యను ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారిటీ విద్యార్థులకు దూరం చేయ్యాలనే కూటమి ప్రభుత్వం కుట్ర.


2.ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ విద్యార్థులు డాక్టర్ కావాలన్న కల కలగానే మిగిలిపోతుంది.


3.ఎస్సీ,ఎస్టీ ,బీసీ,మైనార్టీ డాక్టర్లకు ఉద్యోగ అవకాశాలు దూరం చేస్తున్న ప్రభుత్వం.


4.రాజ్యాంగ బద్దంగా రావాల్సిన రిజర్వేషన్లను కోల్పోతున్నది ఎస్సీ,ఎస్సీ,బీసీ, మైనారిటీ విద్యార్థులు మరియు డాక్టర్లు.


5.మెడికల్ సీట్లు కూటమి ప్రభుత్వం అమ్ముకునే పరిస్థితి వచ్చింది.


6.పీపీపీ విధానము లంచాల కోసం తమ సామాజిక వర్గం మరియు పార్టీ అభివృద్ధి కోసమే.


రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తున్నారని దాని వలన ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థులు డాక్టర్ కావాలన్న కలలను చిదిమేస్తున్నారన్నారు. ఈ క్రమంలో డాక్టర్ సీట్లన్నీ ప్రైవేటు వ్యక్తులకు కూటమి ప్రభుత్వం మరియు పార్టీ అమ్ముకుంటున్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జరిగితే ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ఇతర వ్యక్తులకు మెడికల్ సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజల ఆస్తులను 63 సంవత్సరాలకు ఎలా లీజుకి ఇస్తారు. పీపీపీ విధానము లంచాల కోసము తమ సామాజిక వర్గం మరియు పార్టీ అభివృద్ధి కోసం ఉపయోగపడే విధంగా వుంది, తాజాగా కూటమి ప్రభుత్వం 10 మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం దారుణం. 

నారా చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రైవేటీకరణ వైపే అడుగులు వేస్తారు. తన కేబినెట్లో ఉన్న మంత్రి నారాయణ, విద్యా సంస్థలు నడుపుతున్న వారికి మెడికల్ కళాశాలలను ధారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు 


ఇ నిర్ణయాన్ని ఇంతటితో మానుకోవాలి లేదంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బహుజన్ సమాస పార్టీ నాయకులు హెచ్చరించారు


 ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పట్రా వెంకటయ్య,పట్టణ నాయకులు పూనూరి జాన్సన్,పాల్గొన్నారు,

Post a Comment

Previous Post Next Post