సకాలంలో స్పందించి నిండుప్రాణం కాపాడిన Dr బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీసులు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం ఆత్రేయపురం మండలం, లొల్ల గ్రామంలో కొత్త కాలనీకి చెందిన కుంపట్ల. సత్యనారాయణ s/o వెంకన్న వయసు 65 సంవత్సరాలు కులము కాపు అను ఆసామి జొన్నాడ బ్రిడ్జ్ 15వ పిల్లర్ వద్ద నుండి చనిపోవాలని గోదావరిలోకి దూకుతుండగా అటుగా రాజమండ్రి వైపు వెళ్తున్న 2023 బ్యాచ్ కి చెందిన ప్రొబేషనరీ ఉమెన్ డిఎస్పి అయినా p.ప్రదీప్తి చూసి వెంటనే ఆలమూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీ జి నరేష్ కి ఫోన్ చేయగా అంతట ఎస్ఐ అక్కడే దగ్గర్లో విధులు నిర్వహిస్తున్న స్టేషన్ కానిస్టేబుల్ అయిన పలివెల రాజు, జొన్నాడ హైవే మొబైల్ హోంగార్డ్ అయిన సాయి తో దగ్గర్లో చేపలు వేటాడుతున్న జాలర్లు జొన్నాడకు చెందిన జక్కాల సూరిబాబు బూరి, కోమల దుర్గ ప్రసాద్ సహాయంతో పడవపై వెళ్లి గోదావరిలో కొట్టుకుపోతున్న సదరు కొంపట్ల సత్యనారాయణ కాపాడి ప్రథమ చికిత్స నిమిత్తం ఆలమూరు గవర్నమెంట్ ఆసుపత్రి కు ప్రోబసనరీ డీఎస్పీ ప్రదీప్తి దగ్గర ఉండి ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. అక్కడనుండి రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేసినారు ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్ తెలియజేసినారు.. ఇంత త్వరగా స్పందించి ఒక మనిషి ప్రాణాలు కాపడినందుకు Dr B R అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ B కృష్ణారావు. DSP మురళీమోహన్ సీఐ విద్యాసాగర్, ప్రొబేసనరి డీఎస్పీ ప్రదీప్తి,ఆలమూరు ఎస్ఐ నరేష్. రాజు సాయి. జాలర్లు అయిన సూరిబాబు,దుర్గాప్రసాద్ లను ప్రత్యెకంగ అభినందనలు తెలియజేశారు.

