ఫ్లెక్సీలు మరియు ప్లకార్డుల రూపంలో విద్వేషపూరిత వ్యాఖ్యలు, అనుచిత పదజాలంపై కఠిన చర్యలు : ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్.
(ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )
ఇటీవల కాలంలో ప్రకాశం జిల్లాలో ఫ్లెక్సీ పోస్టర్స్ మరియు ప్లకార్డుల రూపంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు, సమాజంలో వర్గాల మధ్య విద్వేషాలను రేకెత్తించే విధమైన భాష ప్రయోగం, అసభ్యకర వ్యాఖ్యలు కనిపించడం నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ పలు సూచనలు తెలియజేసింది. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు, మతసామరస్యాన్ని కాపాడటానికి ఈ విధమైన ప్రవర్తనను నేరంగా పరిగణిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో, ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ కిందివిధంగా ఫ్లెక్సీ డిజైన్/ప్రింటింగ్ సంస్థలకు మరియు ప్రజలకు పలు సూచనలు తెలియజేశారు.
