బీసీలకు 2024ఎన్నికలలో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన - రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను. ఏపీ బీసీ సంక్షేమ సంఘం.




 

బీసీలకు 2024ఎన్నికలలో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని పల్నాడు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరసన - రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీను. ఏపీ బీసీ సంక్షేమ సంఘం. 

ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 2024 ఎన్నికల ముందు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు వెంటనే అమలుపరచాలనిడిమాండ్ చేస్తూ.. బీసీలకు కావలసిన, 1.బీసీలకు రక్షణ చట్టం

 2. స్థానిక సంస్థల ఎన్నికలలో 33% రిజర్వేషన్లు..3.చట్టసభ ఎన్నికలలో 34%,...4. కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయుట...,5. రాజధాని అమరావతిలో మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేల స్మృతి వనం ఏర్పాటు చేయుట, ఐదు ప్రధాన డిమాండ్లపై బీసీ సంఘం నాయకులు కలెక్టరేట్ కి వెళ్లి డిఆర్ఓ మురళిగారికి మెమోరాండం సమర్పించడం అయినది. ఈ సందర్భంగా.. రాష్ట్ర అధికార ప్రతినిధి, బాదుగున్నల శ్రీను,మాట్లాడుతూ అనాదిగా ఆధిపత్య పెత్తందారీ సమాజంలో అణచివేత పీడన దోపిడీలకు గురవుతూ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న బీసీలకు ఎస్సీ ఎస్టీ మాదిరిగానే ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని ఎన్నికల వాగ్దానం చేశారన్నారు, సంవత్సరంన్నర, గడుస్తున్న ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆ ఊసే ఎత్తటం లేదు అన్నారు. అలాగే చట్టసభలలో 33% మరియు స్థానిక సంస్థలలో నామినేటెడ్ పదవులలో నామినేషన్ వర్కులలో 34% రిజర్వేషన్ అమలు జరుపుతామని మరో వాగ్దానం చేసి ఉన్నారు, వాస్తవంగా బీసీ సమాజం బీసీలకు కూడా తమ జనాభా దామాషాలో రిజర్వేషన్లు అమలు జరపాలని కోరుకుంటుందన్నారు, ఏప్రిల్ తో స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగుస్తున్న వేళ మూడు నెలలు ముందే ఎన్నికలు నిర్వహిస్తామని ఎలక్షన్ కమిషన్ అంటున్నారు కానీ ఇంతవరకు రాష్ట్రంలో కుల గణన సమగ్రంగా నిర్వహించకుండా స్థానిక, ప్రాదేశిక నియోజకవర్గం విభజన, పూర్తి చేయకుండా బీసీలకు స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లు ఎలా నిర్వహిస్తారని వారు ప్రభుత్వాన్ని నిలదీశారు, ఏప్రిల్ తో స్థానిక సంస్థల సమయం ముగుస్తున్నందున మూడు నెలలు ముందే ప్రభుత్వం ఎన్నికల జరపాలని ఆలోచన విరమించాలి.. ఏదైతే రాష్ట్రవ్యాప్తంగా కులగణన జరిపి ప్రాదేశిక నియోజకవర్గం విభజన పూర్తి చేసి బీసీలకు వారి వారి జనాభా దామాషా మేరకు స్థానిక సంస్థల రిజర్వేషన్ అమలు జరపాలన్నారు, రాజ్యాంగ న్యాయపర చిక్కులన్నిటిని అధిగమించి కూటమి ప్రభుత్వం తప్పక బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు అయ్యేలా చేసిన తర్వాతే, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహించాలని వారు మెమోరాండం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం బీసీల జనాభా దాదామా మేరకు బీసీ సబ్ ప్లాన్ రూపొందించి ఆ మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించి ప్రత్యేక నోడల్ ఏజెన్సీల ద్వారా సక్రమంగా నిధులు ఖర్చయ్యేలా చూసి బీసీలకు సాధికారతకు కృషి చేయాలని కోరారు, రాష్ట్ర రాజధాని అమరావతిలో మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల, స్మృతి వనాన్ని సకల సదుపాయాలతో ప్రపంచంలోనే అద్భుత కళాఖండంగా, దేశం గర్వించే రీతిలో నిర్మాణం జరపాలని విజ్ఞప్తి చేశారు, సదరు 5 బీసీ సమాజ విజ్ఞాపనలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరినారు, ఈ కార్యక్రమంలో కొల్లిపర బాలాజీ, సుతారం విశ్వేశ్వరరావు, సరికొండ తిమ్మరాజు, ఫణిదం బోసు బాబు, అల్లూరి శేఖర్, వినుకొండ అప్పారావు, మేకల నాగరాజు తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post