పట్టించుకొని మున్సిపల్ సిబ్బంది.
పశ్చిమ గోదావరి జిల్లా గొంది గ్రామంలో
రోడ్లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయి, గొంది గ్రామంలో పరిసర ప్రాంతాలలో రోడ్లు ఎక్కడ చూసినా మురుగు కాలువలుగానే కనిపిస్తున్నాయి. ఇక నగరంలో చిన్నపాటి చినుకుపడితే చాలు మురుగు కాలువలు, రహదారులు ఏకమవుతాయి. రోడ్లన్ని డ్రైనేజీ కాలువలుగా దర్శనమిస్తున్నాయి. కంపుకొట్టే మురుగు
కాలనీల్లోని ప్రజలు కూడా ఎన్నో ఏళ్లుగా అవస్థలు పడుతు న్నారు. ముడుగునీటి కాలువల నిర్వాహణ సక్రమంగా లేకపోవడంతో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. దీంతో ఎక్కువ రోజులు మురుగునీరు కాలువల్లో నిలిచిపోయి.. దోమలు, ఈగలకు నిలయాలుగా మారుతున్నాయి. ఫలితంగా అనారో గ్యాల బారిన పడుతున్నామని నగరవాసలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చిన్నపాటి వర్షం కురిసినా నగరం జలమయమవుతోంది. ఓ ప్రణాళిక లేకుండా రహదారుల మరమ్మతులు చేపట్టడం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేయడం తప్ప ఎటువంటి ఫలితం ఉండటం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా మురుగు కాల వల సమస్యకు పరిష్కారం దొరక్కపోవడంతో నరసాపురం నగర పాలక సంస్థ అధికారులపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
