మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలి - సి ఐ టి యు.


 


మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలి - సి ఐ టి యు. 

(క్రైమ్ 9 మీడియా గిద్దలూరు నియోజకవర్గ ఇన్చార్జి బి అమృత రాజ్ )

 ప్రకాశం జిల్లా గిద్దలూరు స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. 

ఈ ధర్నాకు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఐ చంటయ్య అధ్యక్షతన వహించారు. 

ఈ ధర్నాలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి ఆవులయ్యపాల్గొని మాట్లాడుతూ జులై నెలలో జరిగిన ఆరు రోజుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఒప్పందం చేసుకుంది .ఆ హామీలను అమలు చేయాలని అన్నారు.

గత ప్రభుత్వం సందర్భంగా 17 రోజులు సమ్మె జరిగిందని ఆ సమ్మె సందర్భంగా మున్సిపల్ కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పిస్తామని 62 సంవత్సరాల వయోపరిమితి పెంచుతామని, రిటైర్డ్ అయిన వారి కుటుంబంలో అర్హత ఉన్న ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని, పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణిస్తే 7 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కల్పిస్తామని ఇతర ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు. 

ప్రభుత్వ సంక్షేమ పథకాలు మున్సిపల్ శానిటేషన్ కార్మికులకు వర్తింపచేయాలని అన్నారు.

సమస్య పరిష్కారం కాకపోతే ఈనెల 23వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. 

ఈ ధర్నాలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు పి పాపయ్య, డి రంగయ్య, ప్రవీణ్ కుమార్, పి కన్నయ్య, మధు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post