యూరియా బస్తాల బరువును కాదు, తమ శ్రమకు గుర్తింపు లభించలేదన్న బాధను మోస్తూ ఆ హమాలీలు ఒక్కసారిగా పని ఆపేశారు కర్తవ్య నిర్వహణలో భాగంగా ఓ సీఐ గారు పని వేగవంతం చేయాలనే తపనతో కాస్త కఠినంగా ప్రవర్తించడం వారిని తీవ్రంగా కలిచివేసింది. మా చెమట చుక్కల విలువ ఇదేనాఅంటూ ఆ శ్రమజీవులు నిరసన వ్యక్తం చేయడంతో, రైతన్నల ఆశలు మోస్తున్న లారీలు అక్కడే నిలిచిపోయాయి
విషయం తెలుసుకున్న మానుకోట జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్. హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. నేరుగా ఆ హమాలీల వద్దకు నడిచి, వారి భుజాలపై చేయి వేసి, సోదరా... మీ కష్టం నాకు తెలుసు. ఎండనక, వాననక మీరు శ్రమిస్తేనే మన రైతులకు ఎరువులు అందుతాయి.
మీరు కార్చే సెమట సుక్క సుక్కాఈ సీమను తడిపే గంగతో సమానం.
మనమందరం రైతుల కోసమే పనిచేస్తున్నాం. నా అధికారి తన డ్యూటీలో భాగంగా పని తొందరగా పూర్తి కావాలని కాస్త కఠినంగా మాట్లాడి ఉండవచ్చు. ఆయన ఉద్దేశం మన రైతులకు మందు బస్తాలు సమయానికి అందాలనే. ఆయన కర్తవ్య నిర్వహణ మనందరి మంచి కోసమే అయినా, ఆ క్రమంలో మీ మనసు నొచ్చుకొని ఉంటే, ఒక అన్నగా, అతని తరఫున నేను మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. ఆ మాటలు వినగానే ఆ హమాలీల కండ్లల నీళ్లు తిరిగినయ్. ఒక ఉన్నతాధికారి తమ శ్రమను గుర్తించి, దానికి ఇంత విలువ ఇవ్వడంతో వారి హృదయాలు ద్రవించాయి.
ఒక పెద్ద సా'బు అట్టా మన దగ్గరకు వచ్చి, మన పనిని పొగిడి, మన్నించమంటే వాళ్ళ హృదయలు కరిగిపోయాయి వారి ఆత్మగౌరవానికి జరిగిన గాయానికి ఆ మాటలు వెన్నలా పనిచేశాయి. వారి బాధంతా ఒక్కసారిగా ఆనందంగా మారిపోయింది. హమాలీలు వెంటనే రెట్టించిన ఉత్సాహంతో పనిలో నిమగ్నమైపోయారు. సంఘటన కేవలం ఓ సమస్యకు పరిష్కారం కాదు, నాయకత్వం ఎలా ఉండాలో చాటిచెప్పిన ఓ గొప్ప పాఠం లాఠీతో సాధించలేనిది, ఆప్యాయతతో కూడిన ఒక్క మాటతో సాధించవచ్చని ఎస్పీ రుజువు చేశారు. హమాలీల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే సంఘటన ఇది
