దళితబిడ్డ వర్ల సాగరబాబును వికలాంగుని చేసిన వారిపై చర్య తీసుకుని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కరపత్ర ఆవిష్కరణ చేసిన-పిడియం జిల్లా కార్యదర్శి జి. రామకృష్ణ.


దళితబిడ్డ వర్ల సాగరబాబును వికలాంగుని చేసిన వారిపై చర్య తీసుకుని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కరపత్ర ఆవిష్కరణ చేసిన-పిడియం జిల్లా కార్యదర్శి జి. రామకృష్ణ.


 పల్నాడు జిల్లా నరసరావుపేట మార్కెట్ యార్డ్ వద్ద ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కారంపూడి మండలం పెదకోదమగుండ్ల లైన్మెన్ గా పనిచేసిన ఎం వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ లైన్మెన్ పర బ్రహ్మచారి, తదితరుల పై చర్యలు తీసుకోవాలని, బాధితుడికి న్యాయం చేయాలని కరపత్ర ఆవిష్కరణ చేసి ఈ సందర్భంగా పిడియం జిల్లా కార్యదర్శి జి. రామకృష్ణ మాట్లాడుతూ కారంపూడి మండలం పెదకొదమగుండ్లలో కరెంటు రీడింగ్ తీసుకునే వర్ల సాగర్ బాబుని లైన్మెన్ ఎం వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ లైన్మెన్ పరబ్రహ్మచార్యులు ఎల్సీ తీసుకున్నాము నీవు కరెంటు స్తంభం పైకి ఎక్కి 11 కేవీ తీగలు కట్ చేయమని, వెంకటేశ్వర స్వామి రథోత్సవం జరగబోతుందని బలవంతంగా స్తంభం ఎక్కించడంతో కరెంట్ షాక్ కొట్టి పైనుంచి కింద పడి చేతులు, కాళ్లు పడిపోయి వెన్నుపూస విరిగిపోయి ఒకటి రెండు మంచం లో ఉండే పరిస్థితి ఏర్పడింది. అనేక ఆస్పటల్ తీసుకెళ్లిన కోలుకోలేకపోయాడు. 

ఈ కుటుంబానికి విద్యుత్ శాఖ అధికారులు గానీ, రెవెన్యూ అధికారులు గాని, ప్రభుత్వం పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి విద్యుత్ శాఖ సూపర్నెంట్ గారికి వాళ్ల కార్యాలయంల వద్ద ధర్నాలు చేసి బాధితులు, ప్రజాసంఘాలు అర్జీలు ఇవ్వడం జరిగింది. ఐన నేటి వరకు సమస్యను పరిష్కరించలేదు.

బాధితులకు న్యాయం చేయాలని ప్రజా సంఘాలు కరపత్రాలు ద్వారా ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్నామని ఆయన అన్నారు. బాధితులు త్వరలో నిరాహార దీక్ష చేపట్టనున్నారని వారికి న్యాయం జరిగేంత వరకు జరిగే పోరాటాలలో పాల్గొనాలని గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు వీ. కోట నాయక్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి డి ఎం జిల్లా అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి,నాయకులు వై. వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Post a Comment

Previous Post Next Post